ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల మెగా డీఎస్సీ పూర్తవడంతో నిరుద్యోగులు ఉపాధ్యాయులుగా కొత్త జీవితం ప్రారంభించారు. టీచర్ పోస్టుల్లో నియామకమైన వారికి ఏ స్థాయిలో వేతనాలు అందిస్తున్నారో తెలుసా?
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల నెలవారీ జీతంతోపాటు అదనపు ఆర్థిక ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోవాలి. నెలవారీ టీచర్ల జీతం, వివిధ భత్యాలు, ఉద్యోగ ప్రొఫైల్ వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
డీఎస్సీ జీతం
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ జిల్లా ఎంపిక కమిటీ స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీ, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపాల్స్ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు నియమితులయ్యారు. మొత్తం 16,347 ఖాళీల భర్తీ జరిగింది. కొత్త ఉపాధ్యాయుల జీతం ఆకర్షణీయంగా ఉంది. వారికి అందే వివిధ ప్రోత్సాహకాలు, ఆర్థిక ప్రయోజనాలు టీచర్లకు ఆర్థిక భరోసా అందిస్తున్నది. ఇది బోధనలో మంచి కెరీర్‌గా నిలవనుంది. పదోన్నతులు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 7వ వేతన సంఘం ప్రకారం ఏపీ ప్రభుత్వ ఉపాధ్యాయుల జీతాన్ని ప్రకటించింది. ఎస్‌జీటీలు వివిధ భాగాలతో కూడిన నెలవారీ జీతం పొందుతారు.
స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ప్రాథమిక వేతన స్కేల్ రూ.28,940 నుంచి ప్రారంభం
ఫిజికల్ ఎడ్యుకేషన్ (పీజీటీ), లాంగ్వేజ్ పండిట్ (ఎల్‌పీ) టీచర్ పోస్టులకు ప్రాథమిక వేతనం రూ.21,230 ఉంటుంది
సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) రూ.21,230 నుంచి రూ.63,010 ఉండే అవకాశం
స్కూల్ అసిస్టెంట్ రూ.28,940 నుంచి రూ.78,910/ వరకు ఉండవచ్చు
ఎస్జీటీ పోస్టుల పూర్తి జీతభత్యాలు
మూల వేతనం రూ.21,230
డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) రూ.5,785 (48 శాతం)
ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ) రూ.2,548 (12 శాతం)
స్థూల జీతం రూ.29,563
స్కూల్ అసిస్టెంట్ జీతభత్యాలు
స్కూల్ అసిస్టెంట్ పోస్టు జీతం స్కేల్ రూ.28,940 నుంచి రూ.78,910 వరకు ఉంటుంది.
మూల వేతనం రూ.28,940
డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) రూ.7,886 (48 శాతం)
ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ) రూ.3,473 (12 శాతం)
స్థూల జీతం రూ.40,299
































