Dark Side of Rave Parties : రేవ్ పార్టీలో ఏమి చేస్తారో తెలుసా? పార్టీలకు, రేవ్ పార్టీలకు ఉన్న డిఫరెన్స్ అదే

www.mannamweb.com


Things to Do at Rave Parties : సినిమా ఇండస్ట్రీలో సెలబ్రెటీలు తరచూ పార్టీలు చేసుకుంటారు. సెలబ్రేట్ చేసుకోవడానికి సెలబ్రెటీలే ఏముంది కానీ.. అందరూ తరచూ వివిధ కారణాలతో పార్టీలు చేసుకుంటారు.

కానీ అలాంటి వాటిలో పోలీసులు ఎక్కువగా ఇన్​వాల్వ్ కారు. మరి ఈ రేవ్​ పార్టీలపై ఎందుకు అంత ఆసక్తి చూపిస్తారు. తాజాగా బెంగుళూరులోని రేవ్ పార్టీ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్​గా మారింది. పార్టీలకు, రేవ్ పార్టీలకు ఉండే డిఫరెన్స్ ఏంటి? అసలు రేవ్ పార్టీలో ఏమి చేస్తారు?

కొంతమంది కలిసి ఓ అకేషన్​ని సెలబ్రేట్ చేసుకుంటే దానిని పార్టీ అంటారు. అలాంటి పార్టీల్లో రేవ్ పార్టీ కూడా ఒకటి. దీనిలో కొంతమంది సభ్యులు కలిసి.. సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ.. ఇది పూర్తిగా ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్​(EDM) తో నిండి ఉంటుంది. ఎప్పుడూ ఊహించని ఓ ట్రాన్స్​లోకి మిమ్మల్ని తీసుకుపోతుంది. ఆ పార్టీలో ఉన్న సభ్యులందరూ ఒకే రిథమ్​తో.. డీజేలు చేసే స్పిన్నింగ్ ట్రాక్​లతో ఎంజాయ్ చేస్తూ.. మరో కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. ఇది కేవలం పార్టీ అనేకంటే.. ఓ అనుభవంగా చెప్పవచ్చు. ఎందుకంటే..

బౌండరీలు లేని లోకం అది..

రేవ్ పార్టీలో బయటి ప్రపంచంలోని నియమాలు వర్తించవు. సొంతంగా.. మీకు నచ్చినట్టు ఉంటూ.. మ్యూజిక్​ని ఎంజాయ్ చేయవచ్చు. మీ అభిరుచిని పంచుకునే ఇతరులతో కనెక్ట్ అయ్యేందుకు స్వేచ్ఛ ఉంటుంది. ఎనర్జీని ఒకరినుంచి మరొకరికి ట్రాన్ఫర్ చేయడం, పూర్తిగా ఎంజాయ్ చేసే వాతావరణం ఈ పార్టీల్లో ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ తరహా పార్టీలో ఇవే చేయాలి.. ఇవి చేయకూడదనే నిబంధనలు ఏమి ఉండవు. నచ్చినవారితో నచ్చినంత సేపు గడిపేయొచ్చు.

ఎప్పుడు మొదలైంది అంటే..

ఈ రేవ్ పార్టీ కల్చర్ 1980లో చికాగోలో ప్రారంభమైంది. అప్పుడు ఇది నైట్ కల్చర్ కాదు. డే టైమ్​లో కూడా చేసుకునేవారు. డీజేలు కొత్త బీట్​లు చేయడం, ఎనర్జీని పెంచే వాతావరణాన్ని సృష్టించడం చేసేవారు. ఇంతకు ముందు ఎప్పుడూ వినని మ్యూజిక్ దానిలో ఉండేది. అనంతరం యూకే చేరుకుంది. యూకేలో ఈ రేవ్ పార్టీ తన రూపాన్నే మార్చేసింది.

పార్టీ లొకేషన్ షేర్ చేసేది అప్పుడే..

యూకేలో రేవ్​పార్టీలు భారీగా చేసేవారు. రాత్రిళ్లు చేసే డ్యాన్స్ పార్టీలకు ఇవి ప్రత్యామ్నాయంగా మారిపోయాయి. సీక్రెట్ ప్లేస్​లలో వీటిని నిర్వహించేవారు. అయితే ఈవెంట్​కు వచ్చే కొన్ని గంటల ముందు మాత్రమే లొకేషన్ షేర్ చేస్తారు. ముందే రివేల్ చేస్తే పార్టీ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని భావిస్తారు. ఈ కల్చర్​లో కొకైన్ వంటి మాదక ద్రవ్యాలు, డ్రింక్స్ చేరడంతో సంస్కృతికి ఈ పార్టీలు విరుద్ధంగా మారిపోయాయి. త్వరిత కాలంలోనే ప్రపంచంలోని ప్రతిమూలకు ఈ పార్టీ కల్చర్ వ్యాపించింది.

కేవలం మ్యూజిక్ మాత్రమే కాదు.. అంతకుమించి..

రేవ్ పార్టీలు కేవలం మ్యూజిక్ అనుభవమే కాదు.. రేర్ అనుభవాన్ని ఇస్తాయి. డ్యాన్స్ చేయడం, మ్యూజిక్ వినడమే కాదు.. మీ మనసుకు నచ్చినట్టు ఉండడమనేదే ఈ పార్టీల ప్రధాన లక్షణం. అర్థరాత్రి ఆపే పార్టీలు కావు ఇది. ఉదయం వరకు రేవర్​లలో ఉత్సాహాన్ని పెంచే ఓ మాయలోకంగా చెప్పవచ్చు. ఇంద్రియాలకు ఈ పార్టీలు విందునిస్తాయనే చెప్పవచ్చు. తెలియకుండానే మీలో ఎనర్జీ, ఉల్లాసం పెరుగుతుంది. ఈ పార్టీల గురించి బయటకు తెలియకుండా మ్యూజిక్ వినేందుకు ఎక్కువగా హెడ్ ఫోన్స్ వినియోగిస్తారు. పార్టీ అయ్యేంత సేపు ఈ హెడ్ ఫోన్స్​లో మ్యూజిక్ ప్లే అవుతూనే ఉంటుంది.

ఒకప్పుడు చిల్​ అవుట్ జోన్​లు

చిల్​ అయ్యేందుకు ఒకప్పుడు రేవ్ పార్టీలు జరిపేవారు.చాలామంది ఈ పార్టీలోని రేవర్​లు లైఫ్​ టైమ్​ ఫ్రెండ్స్​గా మార్చుకునేవారు. ఇప్పుడు మాదక ద్రవ్యాలు, మందు, అసాంఘిక కార్యకలాపాలకు ఇవి వేదికగా మారాయి. ఎలాంటి హద్దులు దీనిలో ఉండవు కాబట్టి.. కొందరు ఈ పార్టీల పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. అందుకే దీనిపై పోలీసులు నిఘా పెట్టడం ప్రారంభించారు.