అసలు భూమి ఉంటుందా.. అంతమైపోతుందా? సూర్యుడు మాయమైన తర్వాత ఏమవుతుందన్న ప్రశ్నలన్నీ ఊహాజనితమే. కానీ సూర్యుడి ఆయువు తగ్గిపోతోందంటూ ఇటీవల యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పేల్చిన బాంబు ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలన్న కుతూహలం పెంచుతోంది. నిజానికి సూర్యుని గురించి చాలా విషయాలు తెలుసని అనుకుంటాం. కానీ మనకు తెలిసింది గోరంత అయితే తెలుసుకోవాల్సింది కొండంత ఉంది. సూర్యుడు తూర్పున ఉదయిస్తే రోజు మొదలవుతుంది. పడమట అస్తమిస్తే రోజు ముగుస్తుంది. కొన్ని కోట్ల సంవత్సరాలుగా కొనసాగుతున్న ప్రక్రియ ఇది. సూర్యుడి వయసు ఇప్పటికి దాదాపు 460 కోట్ల సంవత్సరాలు. కానీ భానుడి ఆయువు మరో 460 కోట్ల ఏళ్లు మాత్రమే బాకీ ఉందట. ఆ తర్వాత సూర్యుడి శక్తి నశించిపోతుందట. ఈ మాట అల్లాటప్పాగా చెబుతున్నది కాదు.. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చెబుతున్న అక్షర సత్యం. ఇంతకీ సూర్యుడు చచ్చిపోతే పరిస్థితేంటి..?
Also Read
Education
More