‘విద్యార్థులు వారి జీవితంలో ఎన్నో చిక్కులను ఎదుర్కుంటూ ఉంటారు. తమాషాగా చెప్పాలనుకుంటే.. వారి జీవితంలో పరీక్షలు కూడా ఒక పెద్ద చిక్కులాగా భావిస్తూంటారు.
ఈ పరీక్షలు వారి జీవితాలను మలుపు తిప్పుతాయనీ.., వారి జీవిత పాఠాలను(చదువు) ఎంత నేర్చుకున్నారో వారికే గుర్తుచేస్తాయనే విషయం వారు గ్రహించకపోవడంలో అతిశయోక్తి లేదనే చెప్పవచ్చు. మరి ఇలాంటి పరీక్షలను రాయాలని మొదటగా కనుగొన్న వ్యక్తి ఎవరో తెలిస్తే.. ‘అబ్బో’ అంటూ నోరెళ్లబెట్టక తప్పదు. ఇక ఎవరో చూద్దాం..’
స్కూల్‌లో చేరింది మొదలు పిల్లలకు రకరకాల పరీక్షలు తప్పవు. మొట్టమొదటి సారిగా ఈ పరీక్షల పద్ధతిని అమెరికాలో స్థిరపడ్డ జర్మన్ ప్రొఫెసర్ హెన్రీ ఫిషెల్ ప్రవేశపెట్టాడు. ఇండియానా యూనివర్సిటీలో పనిచేస్తున్నప్పుడు ఆయన ఈ ఘనకార్యానికి ఒడిగట్టాడు.