మహేష్ బాబుకి క్లాస్, మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు మరీ ముఖ్యంగా అమ్మాయిల ఫాలోయింగ్ చాలా ఎక్కువ. మహేష్ బాబును తమ కలల రాకుమారుడిగా ఊహించుకునే వారు ఎందరో. ఈ లిస్టులో ఓ హీరోయిన్ కూడా ఉందట.
సూపర్ స్టార్ మహేష్ బాబుకి క్లాస్, మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు మరీ ముఖ్యంగా అమ్మాయిల ఫాలోయింగ్ చాలా ఎక్కువ. మహేష్ బాబును తమ కలల రాకుమారుడిగా ఊహించుకునే వారు ఎందరో. కొందరు హీరోయిన్లు సైతం మహేష్ బాబు అంటే తెగ ఇష్టపడేవారనే టాక్ అయితే ఉంది.
ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు మహేష్ బాబుపై ఇష్టాన్ని ఓపెన్ గానే చెప్పేశారు. మహేష్ బాబు స్టైల్, నటన అంటే తమకు ఎంతో ఇష్టమని.. మహేష్ ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అనేసిన హీరోయిన్స్ కూడా ఉన్నారు.
నిజానికి మహేష్ బాబు తనతో కలిసి నటించిన హీరోయిన్ నమ్రతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అయితే నమ్రత మాత్రమే కాదు మహేష్ బాబుతో కలిసి నటించిన ఓ హీరోయిన్ ఆయనంటే తెగ ఇష్టపడేదనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.
ఆమె మరెవరో కాదు స్టార్ హీరోయిన్ కాజల్. మహేష్ బాబుతో కలిసి బిజినెస్ మెన్ సినిమా చేసిన కాజల్ అగర్వాల్.. ఆ సమయంలోనే మహేష్ ప్రేమలో పడిందట. అప్పటికే మహేష్ బాబుకి పెళ్ళైనప్పటికీ, తన కలల రాకుమారుడిగా ఫీల్ అయిందట. ఈ విషయం పెద్దగా బయటకురానప్పటికీ అప్పట్లో ఇండస్ట్రీలో దీనిపై గుసగుసలు నడిచేవి.
మరోవైపు కాజల్ అగర్వాల్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు డిజాస్టర్ మూవీని తన ఫేవరెట్ సినిమా అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమా తనకు చాలా ఇష్టమని.. అందులో తన క్యారెక్టర్ రియల్ లైఫ్ క్యారెక్టర్‌కి చాలా దగ్గరగా ఉంటుందని చెప్పింది.
మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఖాతాలో వేసుకున్న ఈ స్టార్ హీరో, ప్రస్తుతం రాజామౌళి దర్శకత్వంలో భారీ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
#SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో సర్వ హంగులతో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా జక్కన్న ప్లాన్ చేశారు.
భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి లీక్‌లు లేకుండా జాగ్రత్త పడుతున్నారట జక్కన్న. సినిమాకు సంబంధించి ఒక్క ఫోటో గానీ, వీడియో గానీ లీక్ కాకూడదని చెప్పి చిత్ర యూనిట్ కి కొన్ని కండీషన్స్ పెట్టారట రాజమౌళి.
దర్శక నిర్మాతల అనుమతి లేకుండా ఎవరైనా సమాచారాన్ని లీక్ చేసినా, బయటకు చెప్పినా భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పిన రాజమౌళి.. హీరోతో సహా సెట్‌లో ఉన్న వారెవరూ ఫోన్‌లు తీసుకురావడానికి అనుమతి లేదని స్పష్టం చేశారట. ఈ ప్రతిష్టాత్మక సినిమా కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.