టాయిలెట్ కు వెళ్ళినప్పుడు చిటికెన వేలు ఎందుకు చూపిస్తారో తెలుసా ?

www.mannamweb.com


టాయిలెట్ కు వెళ్ళినప్పుడు చిటికెన వేలు ఎందుకు చూపిస్తారో తెలుసా ?

Do you know why you show your little finger when you go to the toilet?

టాయిలెట్ కి చిన్నంగా చిటికెన వేలును చూపిస్తాము. మనం చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు అర్జెంటుగా టాయిలెట్ వస్తే మనం నిలబడి చేసేది మన చిటికెన వేలును టీచర్ కి చూపిస్తూ పర్మిషన్ అడగడం అసలు ఎప్పుడైనా ఆలోచించారా?

లేదా డౌట్ వచ్చిందా? టాయిలెట్ కి సిగ్నల్ గా చిటికెన వేలును ఎందుకు చూపిస్తాం అని, అయితే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం!

మన పురాతన భారతీయ బోధనల ప్రకారం మన చేతి యొక్క ఐదు వేళ్ళు అనేవి మానవ జీవితాన్ని రూపొందించిన ప్రకృతి లోని ఐదు ప్రాథమిక మూలకాలను సూచిస్తున్నట్టుగా తెలిపారు. అవేమిటంటే 1.ఆకాశం, 2.వాయువు, 3.అగ్ని, 4.భూమి, 5.నీరు ఈ ఐదు మూలకాలు మన చేతిలో ఉన్న వేళ్లను సూచిస్తాయి. మన బ్రొటనవేలు అగ్నిని, చూపుడువేలు గాలిని, మధ్య వేలు ఆకాశాన్ని, ఉంగరపు వేలు భూమిని, చిటికెన వేలు నీటిని సూచిస్తుంది. అందువలన మన శరీరంలో ఉన్న నీరు పరిమితి దాటి అదనపు స్థాయికి చేరుకున్నప్పుడు ఆ నీటిని తొలగించేందుకు నీటిని సూచించే ఈ చిటికెన వేలును సిగ్నల్ గా చూపించడం ప్రారంభించారు. అంటే దాని అర్థం ఆ వ్యక్తి మలమూత్రానికి వెళ్లాలని కోరడం. అయితే అలా టాయిలెట్ కి వెళ్లడం కోసం సిగ్నల్ గా చిటికెన వేలును చూపించడం అనేది కేవలం మన భారతదేశంలో మాత్రమే మరి ఇతర ఏ దేశాల్లో లేదు.

ఎందుకంటే ఈ సిగ్నల్ అనేది మన హిందూ పురాతన బోధనల ప్రకారం అవలంబిస్తూ నేటికీ వచ్చాం కాబట్టి. మరి వేరే దేశాల్లో ఈ చిటికెన వేలును ఒక బీర్ ఇవ్వు అని అడగడానికి ఉపయోగిస్తారు. ముఖ్యంగా అమెరికాలో బీర్ కోసం ఇలా అడుగుతారు. సాధారణంగా ఈ దేశాలలో పబ్ లలో, రెస్టారెంట్లలో మ్యూజిక్ అనేది బిగ్గరగా ఉంటుంది కాబట్టి, కౌంటర్ దగ్గర ఉన్న వ్యక్తిని బీర్ ఇవ్వమని కస్టమర్ అడిగేందుకు ఇలా చిటికెన వేలును సిగ్నల్ గా చూపిస్తాడు.

ఇంకో డౌట్ కూడా ఉంటుంది చాలామందికి. టాయిలెట్ కోసం అయితే సింగిల్ నంబర్ ని, టు టాయిలెట్ కోసం మాత్రం టూ నంబర్ ని ఎందుకు చూపిస్తామని, నిజానికి దీనికి అంటూ రెండు రకాలు ఉన్నాయి. అవి ఎంతవరకు కరెక్ట్ అని తెలియదు. కానీ మీకు చెప్తాను. నెంబర్ వన్ ని టాయిలెట్ కి సూచించడానికి కారణం టాయిలెట్ కి ఒక నిమిషం సమయంలో అయిపోతుంది అని, ఇక నంబర్ టు ని టు టాయిలెట్ కి సూచించడానికి కారణం ఏమిటంటే ఇది పూర్తయ్యేందుకు రెండు నిమిషాలు సమయం పడుతుందని ఇలా ఈ నంబర్లను కేటాయించారని అంటారు.