పిండి రుబ్బు ఫ్రిజ్‌లో పెడుతున్నారా

చాలామంది వారానికి సరిపడా ఇడ్లీ, దోశ పిండిని ఒకేసారి రుబ్బుకుంటారు. ఫ్రిజ్‌లో నిల్వ చేస్తుంటారు. అయితే.. రుబ్బిన పిండిని ఇలా ఫ్రిజ్‌లో రోజుల తరబడి పెట్టుకోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిదికాదని నిపుణులు చెబుతున్నారు.


– ఫ్రిజ్‌లో ఉంచినప్పటికీ.. రుబ్బిన పిండిపై బ్యాక్టీరియా, ఫంగస్‌ లాంటివి సులభంగా పెరుగుతాయి. దాంతో చేసిన ఆహార పదార్థాలు అనారోగ్యాన్ని కలిగిస్తాయి.
– నీటిలో నానబెట్టిన కొన్ని రకాల పప్పు దినుసులు ఇట్టే పులిసిపోతాయి. వాటిపై ఈస్ట్‌ పెరుగుతుంది. అలాంటివాటిని రెండుమూడు రోజులపాటు అలాగే ఉంచేస్తే.. ఈస్ట్‌ మరింత పెరిగిపోతుంది. దీన్ని కొద్ది మొత్తంలో తీసుకుంటే ఫర్వాలేదు కానీ, మోతాదుకు మించితే శరీరంలో అలర్జీలకు కారణం అవుతుంది.
– ఎక్కువగా పులిసిన పిండి.. జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది. జీవక్రియ రేటును ప్రభావితం చేస్తుంది.
పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాకు హాని కలిగిస్తుంది. పేగుల ఇన్ఫెక్షన్‌ కలిగిస్తుంది. ఆ పిండితో చేసిన ఆహార పదార్థాలను తింటే కడుపులో గ్యాస్‌, విరేచనాలు ఇతర జీర్ణ సమస్యలు చుట్టుముడతాయి.
తేమ పెరిగి ఫంగస్‌ ఏర్పడుతుంది : ఫ్రిజ్‌లో ఉంచిన పిండిలో తేమ చొరబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మాయిశ్చర్‌తో కలసి పిండిని పాడుచేస్తుంది.
పోషక విలువలు తగ్గుతాయి : ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన పిండిలోని జీవకణాలు నిర్జీవంగా మారి పోషణలోనూ తగ్గుదల ఏర్పడుతుంది.
రుచి, వాసన మారతాయి : పిండిని ఫ్రిజ్‌లో ఉంచిన తర్వాత వండిన వంటకాలకు మామూలు రుచి ఉండదు. సహజమైన వాసన పోతుంది.
బాక్టీరియా పెరగొచ్చు : గాలిమార్పు, తేమ వల్ల కొన్ని ప్రమాదకరమైన సూక్ష్మజీవులు వృద్ధి చెందే ప్రమాదం ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.