సాధారణంగా మనం ప్రతిరోజూ స్నానం చేస్తుంటాం. చేయకపోతే చెమట పడుతుందని, బ్యాడ్ స్మెల్ వస్తుందని ఆందోళన చెందుతుంటాం. కొందరు సాధారణ సోప్‌కి బదులు యాంటీ బ్యాక్టీరియల్ సోప్ కూడా వాడుతుంటారు.
మరికొందరు షాంపూలూ, రకరకాల బ్రాండెడ్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. కానీ అసలు విషయం తెలిస్తే ఆశ్చర్య పోతారు. ఏంటంటే.. ఇలా రోజూ శుభ్రంగా స్నానం చేయడం కంటే.. చేయకపోవడమే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది అన్ని ప్రాంతాలకు ఒకేలా వర్తించకపోవచ్చు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇందులోని సారాంశంతోపాటు నిపుణుల వివరాల రోజూ స్నానం చేయడం ఎందుకు మంచిది కాదో ఇప్పుడు చూద్దాం.
* మన దేశంలో చాలామంది ప్రతిరోజూ స్నానం చేస్తుంటారు. ఇక అమెరికాలో మూడింట రెండు వంతుల మంది డైలీ స్నానం చేస్తుండగా, ఆస్ట్రేలియాలో 80 శాతం మంది రోజూ స్నానం చేస్తున్నారు. ఇక చైనాలో సగానికి సగం మంది వీక్లీ టూ టైమ్స్ మాత్రమే స్నానం చేస్తుంటారు. అయితే రోజూ స్నానం చేయకపోతేనే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సైతం చెబుతున్నారు.
*సాధారణంగానే మానవ చర్మంలో స్వయం సంరక్షణ కోసం నూనెతో కూడిన ఒక పొర ఉంటుంది. దీంతోపాటు చర్మంపై మంచి బ్యాక్టీరియాలు, సూక్ష్మ జీవులు కూడా ఉంటాయి. ఇక మనం రోజూ రుద్దీ రుద్దీ స్నానం చేస్తే ఇవి తొలగిపోయి అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంటుందని కొందరు ఆయుర్వేదిక్ చర్మ వ్యాధి నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా స్కిన్ డ్రైగా మారుతుంది. పగుళ్లు ఏర్పడి చెడు బ్యాక్టీరియా స్కిన్ లోపలికి ప్రవేశించే అవకాశం ఉంటుంది. 2018లో ‘జర్నల్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ డెర్మటాలజీ’లో పబ్లిషైన హార్వర్డ్ హెల్త్ పబ్లికేషన్ రిపోర్ట్ కూడా ఇదే పేర్కొన్నది.
*స్నానం చేసేందుకు మనం వాడే యాంటీ బ్యాక్టీరియల్ సబ్బులు మంచి బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. దీంతో చర్మం సహజ సమతుల్యతను కోల్పోతుంది. రోగ నిరోధక వ్యవస్థ బలనహీనపడుతుంది. ఇక స్నానం చేసే నీటిలో ఉండే సోడియం, ఖనిజాలు, క్లోరిన్, ఫ్లోరైడ్ వంటి కెమికల్స్ వల్ల కూడా స్కిన్ అలెర్జీలు వచ్చే చాన్స్ ఉంటుంది. మరి ఎన్ని రోజులకు ఒకసారి చేస్తే మంచిదనే సందేహం ఎవరికైనా రావచ్చు. కానీ దీనికి నిర్ధిష్టమైన సమయం, సందర్భం ఏదీ లేదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి రోజూ చేయడం మీ వ్యక్తిగత ఆసక్తిని బట్టి కూడా నిర్ణయించుకోవచ్చు.
*కొందరు గంటల తరబడి స్నానం చేస్తుంటారు. దీంతో రోజూ స్నానం చేయడంవల్ల చర్మంతో పాటు జుట్టు రాలే సమస్య తలెత్తవచ్కచు. ఇక స్నానం చేసినప్పుడు కూడా ఎక్కువ సేపు కాకుండా 5 నిమిషాల సమయం కేటాయిస్తే చాలు. ఇక బాడీలోని ప్రతీ ప్రదేశాన్నీ రుద్దుతూ చేయాల్సిన అవసరం కూడా లేదు. సాధారణంగా వాటర్ పోసుకొని స్నానం చేస్తే చాలంటున్నారు నిపుణులు. రోజూ షాంపూ, సబ్బులు కూడా వాడాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడూ వాడినా సరిపోతుంది.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా, వైరల్ వీడియో ఆధారంగా సేకరించబడింది. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.




































