వాట్సాప్‌ స్టేటస్‌ ఉపయోగిస్తుంటారా.? ఇంట్రెస్టింగ్ ఫీచర్స్‌ వచ్చేస్తున్నాయ్‌

www.mannamweb.com


వాట్సాప్‌ స్టేటస్‌ ఫీచర్‌కు ఉన్న క్రేజ్‌ గురించి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా వాట్సాప్‌ స్టేటస్‌ ఫీచర్‌కు సంబంధించి రెండు కొత్త అప్‌డేట్స్‌ను తీసుకొచ్చేందుకు వాట్సాప్‌ సన్నాహాలు చేస్తోంది.

ప్రస్తుతం ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే వాట్సాప్‌లో తీసుకురానున్నారు.

వాట్సాప్‌ స్టేటస్‌లో తీసుకొస్తున్న కొత్త అప్‌డేట్స్‌లో ప్రైవేట్ మెన్షన్ ఫీచర్ ఒకటి. ఈ ఫీచర్‌ సహాయంతో మీరు ఏదైనా స్టేటస్‌ను పోస్ట్ చేసే సమయంలో మరో యూజర్‌ను ట్యాగ్ చేసే అవకాశాన్ని కల్పించనున్నారు.

దీంతో మీరు ఎవరికోసమైతే ఆ స్టేటస్‌ను పోస్ట్ చేస్తున్నారో వారిని ట్యాగ్ చేయొచ్చు. దీంతో ఆ వ్యక్తికి మీరు ట్యాగ్ చేసిన విషయం తెలుస్తుంది. అయితే మీరు ట్యాగ్ చేసిన విషయం కేవలం వారికి మాత్రమే తెలుస్తుంది.

ఇక వాట్సాప్‌ తీసుకొస్తున్న మరో అప్‌డేట్‌ రీషేర్‌ ఫీచర్‌. సాధారణంగా వాట్సాప్‌లో ఇతరులు పోస్ట్ చేసిన స్టేటస్‌ మీకు నచ్చితే వారిని సెండ్‌ చేయమని అడిగి.. మీ ఫోన్‌లో స్టేటస్‌గా పోస్ట్ చేస్తారు.

అయితే ఈ కొత్త అప్‌డేట్‌ సహాయంతో.. ఇతర యూజర్ పోస్ట్ చేసిన స్టేటస్‌ని రీ-షేర్ చేయడం ద్వారా మీ స్టేటస్‌గా సెట్‌ చేసుకోవచ్చు. వాట్సాప్ తన అధికారిక బ్లాగ్ ద్వారా ఈ రెండు కొత్త ఫీచర్లను ప్రకటించింది. త్వరలోనే ఈ ఫీచర్లు అందరికీ అందుబాటులోకి రానుంది.