తక్కువ సంపాదించే వారికన్నా తక్కువ పొదుపు చేసే వారికే రిస్క్ ఎక్కువ. ఎంత సంపాదించినా పొదుపు చేయకపోతే భవిష్యత్తులో ఆర్థిక కష్టాలు ఎదుర్కోక తప్పదు. మీరు సంపాదించిన సొమ్ము వృథాగా పోకూడదంటే మంచి రాబడినిచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్. ప్రభుత్వానికి చెందిన సంస్థల్లో బెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ స్కీమ్స్ ఉన్నాయి. వాటిల్లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో సూపర్ ప్లాన్ అందుబాటులో ఉంది. ఆ పథకమే ఎల్ఐసీ సరళ్ పెన్షన్ యోజన. ఇందులో ఒకసారి కడితే చాలు ప్రతి నెలా ఆదాయం పొందొచ్చు. లైఫ్ లాంగ్ నెలకు 12 వేలు అందుకోవచ్చు.
జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ దేశ ప్రజల కోసం ఎప్పటికప్పుడు కళ్లు చెదిరే ప్రయోజనాలతో న్యూ పాలసీలను ప్రవేశపెడుతూ ఉంటుంది. ఇందులో పెట్టుబడి పెడితే మంచి లాభాలు అందుకోవడంతో పాటు ఏ రిస్క్ ఉండదు. ఎల్ఐసీ సరళ్ పెన్షన్ యెజనలో చేరితే 40 ఏళ్ల నుంచే పెన్షన్ పొందొచ్చు. ఇది సింగిల్ ప్రీమియం పాలసీ. ఈ పాలసీలో చేరాలనుకునే వారు 40 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయసు వారు అర్హులు. ఇందులో ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే జీవితాంతం పెన్షన్ వస్తూనే ఉంటుంది. సరళ్ పెన్షన్ యెజనలో ఇన్వెస్ట్ చేసిన పాలసీదారుడు మరణిస్తే భార్యకు లేదా నామినీకి పెట్టుబడి సొమ్ముతో పాటు పరిహారం అందిస్తారు.
సరళ్ పెన్షన్ యెజనలో రూ. 10 లక్షలు సింగిల్ ప్రీమియంలో పెట్టుబడి పెట్టవచ్చు. అప్పుడు మీరు ప్రతి సంవత్సరం రూ.50,250 పొందుతారు. అంటే మీరు ప్రతి నెలా రూ.4,187 పెన్షన్ అందుకుంటారు. రూ. 2.5 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు రూ. వెయ్యి పెన్షన్ అందుతుంది. అదే 42 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి రూ.30 లక్షల పెట్టి ఈ సరళ్ పెన్షన్ యోజన పాలసీలో చేరితే, ఆ వ్యక్తికి జీవితాంతం నెలకు రూ.12,388 వరకు పెన్షన్ వస్తుంది. సరళ్ పెన్షన్ యెజనలో చేరాలనుకునే వారు ఎల్ఐసీ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానంలో చేరొచ్చు. పూర్తి సమాచారం కోసం సమీపంలోని ఎల్ఐసీ బ్రాంచ్ ను సంప్రదించాల్సి ఉంటుంది.