“డాక్టర్లు చేతులెత్తేశారు.. కానీ ‘ఏఐ’ మా అమ్మ ప్రాణాల్ని కాపాడింది”

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ట్రెండ్ నడుస్తోంది. ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వినియోగం భారీగా పెరిగిపోయింది. ఏఐ సాంకేతికత ప్రతి రంగంలోనూ వ్యాప్తి చెందుతోంది.


మానవుడు పరిష్కరించలేని ఎన్నో సవాళ్లు, సమస్యలకు ఏఐ సెకన్ల వ్యవధిలోనే సమాధానం అందిస్తూ ఔరా అనిపిస్తోంది. భవిష్యత్తులో ఏఐ మరింత అభివృద్ది చెందుతుందని నిపుణులు ఇప్పటికే అంచనా వేస్తున్నారు. నేటి యువత అటు విద్యాపరంగా లేదా ఉద్యోగ పరంగా లేదా వ్యాపార పరంగానైనా కచ్చితంగా ఏఐ సాంకేతికతపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అయితే ఇటీవల జరిగిన ఓ సంఘటన వింటే ఏఐ మానవ జీవితంలో ఏఐ ప్రాముఖ్యత మరోసారి అర్థం అవుతోంది. ఏఐ సాయం వల్ల తన తల్లి బతికిందని ఓ మహిళ ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. ఆ పోస్టు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఈ సమస్యను మొత్తం ఏఐ చాట్ జీపీటీకి వివరించాను. అప్పుడు చాట్ జీపీటీ నాకు చాలా సమాధానాలు ఇచ్చింది. అందులో ఒకటి మా అమ్మ వేసుకునే బీపీ మందులు. వాటి వల్ల కూడా దగ్గు వస్తుందని చెప్పింది. మేము ఆశ్చర్యపోయాం. ఆమె నిరంతరం దగ్గుతూ ఉండడానికి కారణం ఇదేనని చాట్ జీపీటీ తేల్చింది. వెంటనే మేము వైద్యులను సంప్రదించాం. వాళ్లు మందులు మార్చి వేరేవి ఇచ్చారు. ఇప్పుడు ఆమె క్రమంగా కోలుకుంటోంది. మీకు నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. చాట్ జీపీటీ మా అమ్మను కాపాడింది. ఓపెన్ ఏఐను రూపొందించినందుకు సామ్ ఆల్ట్ మన్ కు కృతజ్ఞతలు. అతనికి ఎప్పూడూ రుణపడి ఉంటాం అని ఆ మహిళ భావోద్వేగానికి లోనైంది.” ఏఐ మా అమ్మ ప్రాణాలను కాపాడింది. మా అమ్మ గత ఏడాదిన్నర నుంచి తీవ్రమైన దగ్గుతో బాధపడుతుంది. మేము సిటీలోని అన్ని ప్రముఖ ఆస్పత్రుల్లో , ప్రముఖ వైద్యులకు చూపించాం. ఆయుర్వేదం, హోమియోపతి.. ఇలా అన్ని రకాల వైద్యాన్ని ప్రయోగించాం. కానీ ఏ వైద్యానికీ మా అమ్మ దగ్గు తగ్గలేదు. ఆ తర్వాత ఆమెకు ఆరోగ్యం మరింత క్షీణించింది. ఇంటర్నల్ బ్లీడింగ్ ప్రారంభం అయింది. ఇలానే మరో 6 నెలలు జరిగితే పరిస్థితి చేదాటి పోతుందని వైద్యులు హెచ్చరించారు. నేను చాలా బాధపడ్డాను.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.