????‍♂️దొడ్డిగుంట | ఈ ఊరి బావిలో నీళ్లు తాగితే కవలలు గ్యారంటీ..

www.mannamweb.com


Doddigunta | A Village Has atleast 60 Pairs of Twins | Due to Drinking Water in A Well -ఈ బావిలో నీళ్లు తాగితే కవలలు గ్యారంటీ.. మంచాన పడ్డవాళ్ళు లేస్తున్నారు..
ఈ బావిలో నీళ్లు తాగితే కవలలు గ్యారంటీ..
మంచాన పడ్డవాళ్ళు లేస్తున్నారు..
పాత దొడ్డి గుంటలో అద్భుతాల బావి..

ఈ సువిశాలమైన విశ్వంలో ఎన్నో వింతలు.. మనం నమ్మలేనివిగానే ఉంటాయి. మానవ మేధస్సుకే అందని ఎన్నో అద్భుతాలు ఇప్పటికీ అక్కడక్కడా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. నమ్మినా.. నమ్మకపోయినా… నమ్మలేని నిజాల్లా కొన్ని మనముందు కనిపిస్తూనే ఉంటాయి. అలాంటిదే… ఈ కడుపు పండించే మంచినీటి బావి. పురాతన కాలంనాటిదిగా కనిపిస్తున్న ఈ బావి వెనక అద్భుత చరిత్ర ఉంది. ఇది పిల్లలు లేని మహిళలను గర్భవతులను చేస్తోంది. నిత్యం ఈ బావి నీటినే త్రాగే గర్భిణులకు కవలపిల్లలను కలగజేస్తోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. సర్వ రోగాలకూ ఈ బావినీరు ఒక ఔషదంలా పనిచేస్తోంది. వినడానికి కట్టు కథలా అనిపిస్తున్నా… ఇది మాత్రం పచ్చినిజం.

దొడ్డిగుంట గ్రామ కవలలు...
దొడ్డిగుంట గ్రామ కవలలు…

తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం దొడ్డిగుంట లో ఒక మంచినీటి బావి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తనలోని మంచినీటినుండి అద్భుతాలు సృష్టిస్తూ… శాంకేతిక వైద్య విధానాలకే సవాల్ విసురుతోంది.

తరతరాలుగా గ్రామంలో ఉన్న ఈ బావిలో సుమారు 60 ఏళ్లుగా ఈ అద్భుతాలు జరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. దీనిలో నీటిని తాగడం వల్ల ఒక్క మా గ్రామంలోనే దాదాపు 100 కవల జంటలు ఉన్నాయని.. దీనికి సాక్ష్యం గా చెబుతున్నారు. ఆ నోటా ఈ నోటా.. ఈ అద్భుతాల బావి గురించి తెలుసుకున్న అనేకమంది నిత్యం .. బావినీటికోసం మారుమూలనున్న ఈ గ్రామానికి వస్తున్నారు. ఇలా ఈ బావి నీటిని పట్టుకెళ్లి వాడిన తర్వాత అనేకమంది తల్లి కాలేరని మదనపడుతున్న మహిళలు గర్భం దాల్చడంతో… ఈ నూతికి మరింత ప్రాధాన్యత పెరిగింది. చుట్టుపక్కల ప్రాంతాలనుండే కాకుండా.. తెలంగాణ, విశాఖ, విజయవాడ తదితర ప్రాంతాలనుండి కార్లు పై అనేకంమంది దొడ్డిగుంట వచ్చి టిన్నులతో మంచినీరు తీసుకువెళ్తున్నారు. ఇది పిల్లలను పుట్టించడమే కాదు.. అనారోగ్యాలు దూరం చేస్తోందని నీరు తాగుతున్న అనేకమంది చెబుతున్నారు. ఈ నూతిలో ఉబికివచ్చే పాతాళ జలాల్లో ఎదో మహత్తర శక్తి ఉందని ప్రజలు బావిస్తున్నారు. నీటిలో ఔషధ గుణాలున్నాయన్న వాదనకూడా ఉంది. అసలు ఈ బావి లో ఏముందన్నది.. పక్కనపెడితే… పిల్లలు పుట్టరని డాక్టర్లు తేల్చినవారికీ, పెళ్లై 10 ఏళ్ళు కావస్తున్నా పిల్లలు కలగని వారికీ ఈ బావి వాటర్ త్రాగగానే కడిపోస్తోంది. ఇది చాలా కుటుంబాల విషయాల్లో నిజమని తేలడంతో.. ప్రస్తుతం ఇది ఒక అధ్బుత బావిగా…
పిల్లల బావిగా.. కడుపు పండే బావిగా ప్రచారానికెక్కింది. నమ్మశక్యంగా లేకపోయినా.. ఇది చూసినవారు, దీని ఫలితాన్ని అనుభవించినవారూ మాత్రం. ఈ బావిని తమ పాలిట కల్పతరువుగా బావిస్తున్నారు.