“హై బిపి” కంటి చూపును ప్రభావితం చేస్తుందా? – పరిశోధన ఏమి చెబుతుందో మీకు తెలుసా?

 మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, సరైన వ్యాయామం లేకపోవడం ఇలా కారణాలేమైనా బీపీ బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.28 బిలియన్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని అనేక అధ్యయనాల్లో తేలింది. దీని వల్ల హృదయ స్పందన రేటు పెరగడంతో పాటు శరీర అవయవాలకు తీవ్రమైన నష్టం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా అధిక రక్తపోటు దృష్టి లోపానికి లేదా చూపు కోల్పోవడానికి కారణం అవుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దృష్టి లోపానికి అధిక రక్తపోటు ఎలా కారణం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం!


హైపర్​టెన్సివ్ రెటినోపతి : అధిక రక్తపోటు గుండెను ప్రభావితం చేస్తుందని అందరికీ తెలిసిన విషయమే. కానీ అది కళ్లకూ సెలెంట్​గా హాని కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. అధిక రక్తపోటు దృష్టి లోపానికి లేదా చూపు కోల్పోవడానికి కారణం కావచ్చు, దీనినే హైపర్​​టెన్సివ్ రెటినోపతి అంటారు. దీని వల్ల కంటి వెనుక భాగంలో ఉన్న రెటీనాలోని చిన్న రక్త నాళాలను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. అధిక రక్తపోటు వల్ల రక్తనాళాలు దెబ్బతిని దృష్టి మసకబారడం లేదా దృష్టి లోపం వస్తుందని American Heart Association పేర్కొంది. రెటీనా మెదడుకు దృశ్య సంకేతాలను పంపడానికి ఆక్సిజన్ అధికంగా ఉండే రక్తంపై ఆధారపడుతుంది, ఈ రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు రెటీనా దెబ్బతిని దృష్టి సమస్యలకు దారితీస్తుందని నిపుణులు వివరించారు. అంతే కాకుండా కంటిలో కోరోయిడోపతి, రెటినోపతి, ఆప్టిక్ న్యూరోపతిలకు తీవ్ర నష్టం కలుగుతుందని National Library of Medicine పేర్కొంది.

ఇతర సమస్యలు : రెటీనా కింద ద్రవం పేరుకుపోవడం వల్ల దృష్టి లోపం లేదా దృష్టికి హాని కలిగించే మచ్చలు ఏర్పడతాయని American Heart Association పేర్కొంది. వీటితో పాటు దృష్టిలో చిన్న నలుపు లేదా బూడిద రంగు మచ్చలు కనిపించవచ్చనని వివరించారు. కంటి నుంచి మెదడుకు సంకేతాలను పంపే ఆప్టిక్ నరం దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపారు. అధిక రక్తపోటు రెటీనాకు సాధారణ రక్త ప్రవాహాన్ని దెబ్బతీస్తుందని clevelandclinic అధ్యయనంలో పేర్కొంది.

వృద్ధుల్లో : సాధారణంగా రక్తపోటు అనేది గుండెపోటు, స్ట్రోక్​కు కారణమవుతుందని నిపుణులు తెలిపారు. కానీ, కాలక్రమేణా అది కిడ్నీ, కళ్లు, మెదడును కూడా తెలియకుండానే నిశ్శబ్దంగా దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు. కొంతమందికి తగినంత విశ్రాంతి తీసుకున్నా అలసిపోయినట్లు, నిద్రపోవడంలో ఇబ్బంది పడటం లాంటి సమస్యలు అధిక రక్తపోటు వల్లనే వస్తాయని తెలిపారు. కొంతమంది వృద్ధుల్లో వినికిడి, తల తిరగడం లేదా కళ్లు తిరిగి కింద పడిపోవడం, జ్ఞాపకశక్తి సమస్యలు కూడా ఉంటాయని పేర్కొన్నారు.

అదుపులో లేకపోతే : అధిక రక్తపోటును అదుపులో పెట్టుకునేందుకు చాలా మంది విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. జీవనశైలిలో మార్పు, బీపీని అదుపులో ఉంచే ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రక్తపోటు వచ్చినప్పుడు ఇక ఈ నియమాలు పాటించకపోతే ఈ సమస్య మరింత తీవ్రతరం అవుతుందంటున్నారు. కళ్లకు, ముఖ్యంగా రెటీనా లేదా కంటిని మెదడును కలిపే నరాలు శాశ్వతంగా దెబ్బ తినవచ్చనని వివరించారు. అందుకే రక్తపోటు అదుపులో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. అంతే కాకుండా అధిక రక్తపోటు ఉన్నవారు క్రమం తప్పకుండా సంబంధిత డాక్టర్​ను సంప్రదించడం మంచిదని సలహా ఇస్తున్నారు.

సరైన చికిత్స : మొబైల్, లాప్​టాప్ స్క్రీన్​ ఎక్కువసేపు చూడటం వల్ల కూడా కళ్లు దెబ్బతినే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధిక రక్తపోటు అనేది కళ్లు దెబ్బతినడానకి కారణం కాకపోవచ్చు కానీ వాటి పరిస్థితిని మరింత దిగజార్చవచ్చని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా పర్యవేక్షణ, సరైన చికిత్స, ఆరోగ్యకరమైన జీవనశైలితో దృష్టిని, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పేర్కొంటున్నారు.

ఈ అలవాట్లుతో : హైపర్​టెన్సివ్ రెటినోపతిని నివారించడానికి లేదా చికిత్స చేయడానికి అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం నిపుణులు పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, బరువు తగ్గడం, ధూమపానం, మద్యం తగ్గించడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని సలహా ఇస్తున్నారు.

NOTE : అధిక రక్తపోటుకు సంబంధించి ఇక్కడ పేర్కొన్న ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.