తులసి మొక్క ఇంట్లో పవిత్రత, ఆరోగ్యానికి ప్రతీక. ఎప్సమ్ సాల్ట్ స్ప్రేతో ఆకులు పచ్చగా మెరుస్తాయి, కీటకాలు దూరం అవుతాయి, గాలి పరిశుభ్రత పెరుగుతుంది.
భారతీయ ఇళ్లలో తులసి మొక్కకు ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు.. వైద్యపరంగా కూడా అత్యంత ప్రాధాన్యం ఉంది. ఇంటి ముందు లేదా ప్రాంగణంలో తులసి ఉండటం అంటే ఒక పవిత్రత, ఒక సానుకూల శక్తి అని నమ్మకం. ప్రతి ఉదయం దీపం వెలిగించి.. తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేయడం అనేక కుటుంబాల్లో ఆచారం. తులసి ఆకుల్లో ఉన్న ఔషధ గుణాలు గాలి పరిశుభ్రతను పెంచడం, వ్యాధులను దూరం ఉంచడం వంటి ప్రయోజనాలను ఇస్తాయి.
అయితే ఇంత విలువైన మొక్కను పెంచడంలో చాలా మంది ఒక సాధారణ సమస్యను ఎదుర్కొంటున్నారు.. మొక్క త్వరగా ఎండిపోవడం, ఆకులు పసుపు రంగులోకి మారడం, చివరకు పూర్తిగా నిద్రపోవడం జరుగుతుంటుంది. అయితే తులసి మొక్క బాగా పెరగడానికి చాలా మంది క్రమంగా నీరు పోస్తే చాలు అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం తులసి మొక్క బలంగా పెరగడానికి నీరు మాత్రమే సరిపోదు.. దానికి సరైన పోషకాలు కూడా ఇవ్వాలి.
అయితే ఇంత విలువైన మొక్కను పెంచడంలో చాలా మంది ఒక సాధారణ సమస్యను ఎదుర్కొంటున్నారు.. మొక్క త్వరగా ఎండిపోవడం, ఆకులు పసుపు రంగులోకి మారడం, చివరకు పూర్తిగా నిద్రపోవడం జరుగుతుంటుంది. అయితే తులసి మొక్క బాగా పెరగడానికి చాలా మంది క్రమంగా నీరు పోస్తే చాలు అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం తులసి మొక్క బలంగా పెరగడానికి నీరు మాత్రమే సరిపోదు.. దానికి సరైన పోషకాలు కూడా ఇవ్వాలి.
ఈ ద్రావణం మొక్కలో క్లోరోఫిల్ తయారీలో సహాయపడుతుంది. క్లోరోఫిల్ పెరిగినప్పుడు తులసి ఆకులు మళ్లీ పచ్చగా మెరవడం ప్రారంభిస్తాయి. మొక్క వేర్లు బలపడతాయి, కొత్త కొమ్మలు వేగంగా వస్తాయి. కేవలం రెండు మూడు వారాల్లోనే మీరు తేడా గమనిస్తారు. సూర్యోదయానికి ముందు లేదా సూర్యాస్తమానం సమయంలో స్ప్రే చేయడం మంచిది. ఎక్కువ సూర్యరశ్మి ఉన్న సమయంలో స్ప్రే చేస్తే మొక్క ఆకులు వేడి కారణంగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సాయంత్రం సాయంకాలం సమయమే బెస్ట్.
ఎప్సమ్ సాల్ట్ మొక్కకు పోషకాలు అందించడమే కాకుండా, అనేక రకాల కీటకాలను దూరంగా ఉంచుతుంది. ఇది సహజ కీటకనాశకం వలె పనిచేస్తుంది. తులసి మొక్క రోగనిరోధక శక్తి పెరుగుతుంది, వేర్లు బలపడతాయి. దీని వల్ల మొక్క ఎక్కువ కాలం జీవించి మరింత ఆరోగ్యంగా పెరుగుతుంది.
తులసి పచ్చగా మెరవడం ఇంట్లో సానుకూల శక్తిని తీసుకువస్తుంది అని అనేక మంది విశ్వసిస్తున్నారు. తులసి చుట్టూ గాలి పరిశుభ్రంగా ఉంటుంది. దాని ఆకులు యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు కలిగి ఉంటాయి. గాలి నాణ్యత మెరుగుపడటంతో శ్వాసకోశ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
తులసి మొక్కను ఆరోగ్యంగా ఉంచడం ఖరీదైన పని కాదు. ఒక్క స్ప్రేతో పచ్చదనం తిరిగి వస్తుంది. పచ్చగా మెరుస్తున్న తులసి మొక్క చూడటమే మనసుకు శాంతిని ఇస్తుంది. క్రమం తప్పకుండా కొద్దిగా శ్రద్ధ పెట్టడం ద్వారా మీరు మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీతో నిండిన వాతావరణాన్ని సృష్టించవచ్చు.
































