ప్రకృతిలో ఉండే ఎన్నో రకాల మొక్కలు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతాయంట. మరీ ముఖ్యంగా చాలా మొక్కల్లో మంచి ఔషధ గుణాలు ఉంటాయి. అయితే మన చుట్టు పక్కల కనిపించే అత్తి పత్తి మొక్క వలన అనేక లాభాలు ఉన్నాయంట.
అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
అత్తి పత్తి మొక్క రసాన్ని రక్తం కారుతున్న గాయంలేదా, దెబ్బతగిలిన చోట పూయడం వలన వెంటనే రక్తం ఆగిపోవడమే కాకుండా, గాయం కూడా త్వరగా మానిపోతుందంట. అంతే కాకుండా ఒకానొక సమయంలో మీరు చాక్ తో మీ వేలిని కోసుకున్నప్పుడు కూడా ఈ ఆకులను దంచి చేతికి గాయం ఉన్న చోట పెట్టడం వలన నొప్పి తగ్గుతుందంట.
బాలికలలో బహిష్టు సమయంలో అధిక రక్తస్రావాన్ని నివారించడానికి ఇద చాలా ఉపయోగకరంగా ఉంటుందంట. ఈ ఆకులను తీసుకొని, వాటిని శుభ్రంగా కడికి ఎక్కువ నీరు పోసి, బాగా మరిగించాలంట, దానికి 1 చిటికెడు పటిక/స్పాటికా వేసి రోజుకు 2 నుండి 3 సార్లు తినడం వలన అధిక రక్తస్రావం జరగకుండా ఉంటుందంట.
కొంత మంది జీర్ణకోశ వ్యాధులతో బాధపడుతుంటారు. తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం కాదు అంతే కాకుండా, మలబద్ధకం సమస్యతో బాధ పడుతారు. అలాంటి వారికి ఇది ఓ వరం అని చెప్పుకోవాలి. అత్తి పత్తి చెట్టు ఆకులను, వేర్లను బాగా చూర్ణం చేసి దాని రసాన్ని తీసి దాన్ని తాగడం వలన మలబద్ధకం సమస్య నుంచి బయటపడతారంట. వన్ గ్లాస్ నీటిలో వన్ టీస్పూన్ రసం కలుపుకోవాలంట.
మొటిమల సమస్యతో బాధపడేవారు, అంతే కాకుండా మంగు మచ్చల సమస్యతో బాధపడే వారు ఈ ఆకు రసాన్ని ముఖానికి పూసుకోవడం వలన మొటి మలు, మంగు మచ్చలు తొలిగిపతాయంట. అలాగే, దురద వంటి చర్మ సమస్యలతో బాధ పడే వారు చర్మ వ్యాధుల నుండి ఉపశమనం పొందడానికి, ఈ మొక్క రసాన్ని చర్మానికి పూయడం వల్ల చర్మ వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చు.
































