ప్రజలు భోజనం తర్వాత పాన్ తినడానికి ఇష్టపడతారు. ఇది ఆహారం జీర్ణం కావడానికి సాయపడుతుందని పేర్కొంటారు. అయితే తమలపాకులను నీళ్లలో మరిగించి తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తమలపాకు నీరు జలుబు, దగ్గులో మేలు చేస్తుంది. ఇది కఫం, పిత్త దోషాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇంకా తమలపాకు నీరు అనేక ప్రయోజనాలను అందిస్తుంది.. ఆ ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి..
తమలపాకు నీటిని ఎలా తయారు చేసుకోవాలి: 3-4 తమలపాకులను కడిగి మూడు గ్లాసుల నీటిలో బాగా మరిగించి, ఒక గ్లాసు మిగిలి ఉన్నప్పుడు, అది చల్లారిన తర్వాత రోజుకు రెండు మూడు సార్లు త్రాగాలి. ఇది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు.
మధుమేహాన్ని నియంత్రిస్తాయి: తమలపాకు నీరు మధుమేహ వ్యాధిగ్రస్తుల శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ నీటిని తప్పనిసరిగా తాగాలి.
మలబద్ధకం నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి: ఈ రోజుల్లో చాలా మంది మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. మలబద్ధకం విషయంలో తమలపాకు నీటిని తాగడం వల్ల చాలా వరకు మేలు జరుగుతుంది.
కఫం -పిత్త దోషాలను తొలగిస్తుంది: యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉన్న తమలపాకు నీరు దగ్గు, పిత్త దోషాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది గొంతు వాపును తగ్గించడంలో, ఛాతీలో పేరుకుపోయిన కఫాన్ని తొలగించడంలో సహాయపడుతుంది.
జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి: మీకు వాంతులు, విరేచనాలు, వికారం వంటి సమస్యలు ఉన్నట్లయితే ఇందులో కూడా తమలపాకు నీరు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నీరు మన జీర్ణ శక్తిని సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇకా మన జీర్ణ శక్తిని ఆరోగ్యంగా ఉంచుతుంది.
చెడు శ్వాసను దూరం చేస్తుంది: తమలపాకులతో తయారుచేసిన నీరు నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. దీనితో పాటు, ఇది దంతాలను పాలిష్ చేయడంలో కూడా సహాయపడుతుంది.