మామూలుగా కొంతమంది నిత్య దీపారాధన చేస్తే వారంలో రెండు మూడు రోజులు మాత్రమే దీపారాధన చేసేవారు ఉన్నారు. అయితే ఇలా దీపారాధన చేసే సమయంలో చాలామంది తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు,తప్పులు చేస్తూ ఉంటారు.
వాటి వల్ల పూజ చేసిన ఫలితం దక్కకపోగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. మరి దేవుడికి పూజ చేసే సమయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పూజ సమయంలో దేవునికి సమర్పించే నైవేద్యం చాలా శుభ్రంగా, స్వచ్ఛంగా ఉండేలా చూడాలట.
అది కూడా నైవేద్యం ఎప్పుడూ సాత్విక ఆహారమే ఉండాలా శ్రద్ధ తీసుకోవాలని చెబుతున్నారు. అలాగే దేవునికి నైవేద్యంగా పెట్టే ఆహారాన్ని తయారుచేసేటప్పుడు, వంటగదిని పూర్తిగా శుభ్రం చేయాలట. అలాగే మిమ్మల్ని మీరు శుభ్రంగా ఉంచుకోంవాలని చెబుతున్నారు. మీరు పూజ కోసం ఆహారాన్ని సిద్ధం చేస్తుంటే, ఎల్లప్పుడూ స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి స్వామికి నైవేద్యాన్ని సిద్ధం చేయాలట. అలాగే ఎవరైతే ప్రసాదం తయారు చేసి ఉంటారు వాళ్లే దేవుడికి పెట్టడం మంచిదని చెబుతున్నారు. అలాగే నైవేద్యం తయారు చేసే పాత్ర కూడా చాలా ముఖ్యం.
ఇది బంగారం, వెండి, రాగి లేదా ఇత్తడితో చేయాలట. మీకు కావాలంటే, మీరు మట్టి లేదా చెక్క పాత్రలలో అందించవచ్చట. కానీ మీరు అల్యూమినియం, ఇనుము, స్టీల్ లేదా ప్లాస్టిక్ పాత్రలలో నైవేద్యం సమర్పించకూడదని పోతున్నారు. ప్రసాదం సమర్పించిన తర్వాత ఆలయంలో ఉంచకూడదట. ఇలా ప్రసాదం నుంచి సమర్పించిన తర్వాత దానిని కుటుంబ సభ్యులకు పంచాలని, చెబుతున్నారు. దీపం వెలిగించేటప్పుడు ఎప్పుడూ కూడా ముందుగా ఒత్తి వేసి ఆ తర్వాత నూనె పోయకూడదట. నూనె పోసిన తర్వాత రెండు లేదా అంతకంటే ఎక్కువ వత్తులు ఒకటిగా చేసి వేయాలని చెబుతున్నారు. దీపారాధన నూనెతో పాటుగా అప్పుడప్పుడు ఆవు నెయ్యి నువ్వుల నూనె, కొబ్బరి నూనె వంటి వాటితో పూజ చేస్తే మంచి ఫలితం కలుగుతుందని చెబుతున్నారు