జనవరిలో ఈ 10 సౌత్ ఇండియా ప్రదేశాలను అస్సలు మిస్సవ్వొద్దు

1. మున్నార్, కేరళ జనవరిలో కేరళ రాష్ట్రంలోని మున్నార్(Munnar) ప్రాంతం చల్లని ఉదయాలు, మెల్లగా కదిలే మేఘాల దృశ్యాలతో మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది.


టీ తోటలు, జలపాతాలు, జాతీయ పార్కులు, ప్రకృతి సోయగాలతో ఈ కాలంలో మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకే పర్యాటకులు ఈ ప్రాంతంలో పర్యటించేందుకు ఎక్కువ ఆసక్తిని చూపిస్తుంటారు.

2. ఊటీ, తమిళనాడు తమిళనాడులోని ఊటీ(Ooty) ప్రాంతం పర్యాటకులను ఆకర్షించడంలో ఎప్పుడూ ముందుంటుంది. ఇక్కడ ఎన్నో ప్రకృతి దాగి ఉన్నాయి. నీలిగిరి హిల్స్‌లోని వీధులు, సుందరమైన తోటలు, రైలు ప్రయాణం ఈ సమయంలో మరింత అందంగా అనిపిస్తుంది. జనవరిలో శీతాకాల వాతావరణం ప్రయాణాన్ని మరింత ఉల్లాసంగా చేస్తుంది.

3. కోడుగు (కూర్గ్), కర్ణాటక దక్షిణ భారతదేశంలో పర్యాటకులను ఆకట్టుకోవడంలో ముందుండే మరో ప్రాంతం కూర్గ్(Coorg). జనవరిలో ఈ ప్రాంతం మరింత ఆహ్లాదంగా ఉంటుంది. ఈ సమయంలో కాఫీ తోటలు, గలగల ప్రవహిస్తున్న నదులు, ప్రకృతి దృశ్యాలు కోడుగులో మరింత ఆకర్షణీయంగా ఉంటాయి.

4. హంపి, కర్ణాటక కర్ణాటకలోని హంపి (Hampi).. ఎన్నో అద్భుత చారిత్రక కట్టడాలకు నిలయం. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌ అయిన హంపిని జనవరి నెలలో సందర్శించడం ఒక గొప్ప అనుభవం. ఏ కాలంలో వెళ్లినా ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ, జనవరిలో చల్లని వాతావరణం పర్యాటకులను మరింత కట్టిపడేస్తుంది. మీరు తెల్లవారుజామునే ప్రయాణాన్ని ప్రారంభిస్తే.. ప్రాచీన ఆలయాలు, రాజ ప్రాంగణాలు, రాళ్లపై మలచబడిన అద్భుత దృశ్యాలను తిలకిస్తూ కొత్త అనుభూతిని పొందవచ్చు.

5. పుదుచ్చేరి దక్షిణ భారతదేశంలో మరో పర్యాటక ప్రాంతం పుదుచ్చేరి (Puducherry). జనవరి నెలలో సూర్యోదయం వేళల్లో ఇక్కడి ఫ్రెంచ్ క్వార్టర్స్ వీధులు, సముద్ర తీరం, బీచ్ క్యాఫేలు, స్పష్టమైన ఆకాశంతో మరింత ఆహ్లాదకరంగా ఉంటాయి.

6. వాయనాడ్, కేరళ కేరళలోని మరో ఆకర్షణీయ ప్రాంతం వాయనాడ్ (Wayanad). జనవరిలో చెట్లు, అడవులు, జలపాతాలు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తాయి. ఎడక్కల్ గుహలు, బనాసుర డ్యాం, వైల్డ్ లైఫ్ సంక్ష్యుయరీ వంటి ప్రదేశాలు సందర్శకులను ఆకర్షిస్తాయి. ఈ ప్రాంతంలోని సుగంధ ద్రవ్యాల తోటలు, వాటర్ ఫాల్స్ పర్యాటకులకు మరింత ఉల్లాసాన్ని కలిగిస్తాయి.

7. మదురై, తమిళనాడు తమిళనాడులో దేవాలయాల నగరంగా పేరుగాంచిన మదురై (Madurai).. ఎప్పుడూ పర్యాటకులను ఆకర్షిస్తూనే ఉంటుంది. జనవరిలో ఇక్కడ వాతావరణం ఎంతో బాగుంటుంది. ప్రఖ్యాత మదుర మీనాక్షి అమ్మన్ ఆలయాన్ని సందర్శించేందుకు సాయంత్రంవేళ మంచి సమయంగా చెప్పవచ్చు. అనేక చారిత్రక కట్టడాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఉండే వీధులు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.

8. కన్యాకుమారి, తమిళనాడు తమిళనాడులోని కన్యాకుమారి (Kanyakumari).. పర్యాకులను ఆకర్షించే ప్రాంతాలలో ప్రముఖమైనదిగా చెప్పవచ్చు. భారతదేశ చివరి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలోనే ఓవైపు అరేబియన్ సముద్రం, మరోవైపు బంగాళాఖాతం ఉంటాయి. ఇక్కడ జనవరి నెలలో సూర్యోదయం, సూర్యాస్తమయం చూడటం పర్యాటకులకు జీవితంలో నిలిచిపోయే అనుభూతినిస్తుంది.

9. అలప్పుజ, కేరళ కేరళలోని అలప్పుజ (alappuzha ) పర్యాటకులకు మరో స్వర్గధామమైన ప్రాంతం. ఇక్కడ తీవ్రమైన వేడి లేకపోవడంతో హౌస్‌బోట్ ప్రయాణాలు, పల్లె జీవితం ఆస్వాదించవచ్చు. ఇక్కడి బ్యాక్ వాటర్ అందాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. చిన్న పడవల్లో ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఓ వైపు సముద్రం నీరు, మరోవైపు పచ్చని చెట్లు, చల్లక వీచే గాలులు ఎంతగానో ఆకట్టుకుంటాయి.

10. వర్కల, కేరళ కేరళలోని వర్కల ప్రాంతం కూడా పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది. జనవరి నెలలో ఇక్కడ అరేబియా సముద్రంలో సూర్యాస్తమయం చూడడానికి బీచ్ క్లిఫ్స్, యోగా స్టూడియోలు మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. జనవరిలో దక్షిణ భారతదేశంలోని ఈ ప్రాంతాలు పర్యాటకులకు ఎంతో అనువుగా ఉండటంతోపాటు మరిచిపోలేని అనుభూతులను ఇస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ప్రాచీన జాతరా స్థలాలు, ఆలయాలతో నిండిన పట్టణాలు, ప్రశాంత తీరప్రాంతాలతోపాటు జనవరి నెల వాతావరణం కూడా ఈ ప్రాంతాల్లో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అందుకే జనవరి నెలలో పర్యాటకులు సందర్శించేందుకు పూర్తిగా అనుకూలమైనవని చెప్పవచ్చు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.