అర‌టి పండ్ల‌ను తిన్న త‌రువాత తొక్క‌ల‌ను ప‌డేయ‌కండి.. వాటితో ఎన్నో ఉప‌యోగాలు ఉంటాయి

అర‌టి పండ్లు మ‌న‌కు ఏడాది పొడ‌వునా అన్ని సీజ‌న్ల‌లోనూ అందుబాటులో ఉంటాయి. చాలా త‌క్కువ ధ‌ర‌కే ల‌భిస్తాయి. క‌నుక అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు ఈ పండ్లు అందుబాటులో ఉంటాయి. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. అర‌టి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. వీటిల్లో అనేక పోష‌కాలు ల‌భిస్తాయి. ఇవి మ‌నల్ని రోగాల బారి నుంచి ర‌క్షిస్తాయి. అయితే కేవ‌లం అర‌టి పండ్లే కాదు, అర‌టి పండు తొక్క‌లు కూడా మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిని కేవ‌లం ఆరోగ్య ప్ర‌యోజ‌నాల కోసం మాత్ర‌మే కాకుండా, అందాన్ని పెంచ‌డం కోసం, ఇత‌ర గృహావ‌స‌రాల‌కు కూడా వాడుకోవ‌చ్చు. అరటి పండ్ల‌ను తిన్న త‌రువాత తొక్కల‌ను ప‌డేయ‌కుండా వాడుకుంటే ఎన్నో ఉపయోగాలు ఉంటాయి.


చ‌ర్మ సౌంద‌ర్యానికి..

అరటి పండు తొక్క లోపలి భాగాన్ని ముఖంపై రోజూ మర్దనా చేసినట్లు రాస్తుండాలి. దీంతో కొద్ది రోజుల్లోనే చర్మం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ఉండే ముడతలు పోతాయి. మొటిమ‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ముఖ సౌంద‌ర్యం పెరుగుతుంది. య‌వ్వ‌నంగా క‌నిపిస్తారు. అలాగే కళ్లు బాగా వాపులకు గురైనట్లు కనిపిస్తుంటే వాటిపై అరటి పండు తొక్కలను కొంత సేపు ఉంచి కళ్లు మూసుకోవాలి. తరచూ ఇలా చేస్తే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. చలికాలంలో సహజంగానే మన చర్మం పగులుతుంటుంది. ఈ సమస్య ఉన్న వారు అరటి పండు తొక్కలను చర్మంపై రాయాలి. దీంతో చర్మానికి తేమ అందుతుంది. చర్మం మృదువుగా మారుతుంది. మొటిమలపై నిత్యం అరటి పండు తొక్కలను మర్దనా చేసినట్లు రాస్తుంటే కొద్ది రోజులకు మొటిమలు పోతాయి.

పులిపిర్లు త‌గ్గేందుకు..

సోరియాసిస్‌ ఉన్నవారికి అరటి పండు తొక్కలు ఎంతగానో మేలు చేస్తాయి. సోరియాసిస్‌ ఉన్న ప్రదేశంలో అరటి పండు తొక్కలను రాస్తుంటే తేమ అందుతుంది. దీంతోపాటు దురద తగ్గుతుంది. అలాగే స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. పులిపిర్ల‌పై అరటి పండు తొక్కను ఉంచి పైన టేప్‌ వేయాలి. రాత్రంతా దాన్ని అలాగే ఉంచాలి. మరుసటి రోజు తీస్తే పులిపిర్లు పోతాయి. అరటి పండు తొక్కల్లో శక్తివంతమైన యాంటీ మైక్రోబియల్‌, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు ఉంటాయి. అందువల్ల అరటి పండు తొక్కతో గాయాలను త్వరగా మానేలా చేయ‌వ‌చ్చు. అరటి పండు తొక్కలో కెరోటినాయిడ్లు, పాలీఫినాల్స్‌ అనబడే బయో యాక్టివ్‌ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి పోషణను అందిస్తాయి. అరటి పండు తొక్కలను జుట్టు కుదుళ్లకు బాగా రాసి కొంత సేపు అయ్యాక తలస్నానం చేయాలి. దీంతో జుట్టు సమస్యలు తగ్గుతాయి. అరటి పండు తొక్కలతో దంతాలను నిత్యం శుభ్రం చేసుకుంటే దంతాలు తెల్లగా మారుతాయి.

ఇత‌ర అవ‌స‌రాల‌కు..

ఎండ వల్ల కందిన చర్మంపై దద్దుర్లు, దురదలు వచ్చినా చర్మంపై అరటి పండు తొక్కను రాస్తే ఆయా సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అరటి పండు తొక్కలు రెండు తీసుకుని వాటిని ఫ్రిజ్‌లో ఉంచి గడ్డ కట్టించాలి. అనంతరం వాటిలో నుదుటిపై ఒక తొక్క, మెడపై ఒక తొక్కను ఉంచాలి. దీంతో కొంత సేపట్లోనే తలనొప్పి తగ్గుతుంది. చర్మంపై ఎక్కడైనా ముళ్లు లేదా చిన్నపాటి పదునైన వస్తువులు గుచ్చుకున్నప్పుడు అవి బయటకు రాకపోతే వాటిపై అరటి పండు తొక్కను ఉంచాలి. అనంతరం 15 నిమిషాల తరువాత వాటిని సులభంగా బయటకు తీయవచ్చు. అరటి పండు తొక్క తీస్తే ముళ్లు బయటకు వస్తాయి. అరటి పండు తొక్కలను ఉపయోగించి ఇంట్లో పెంచుకునే మొక్కల ఆకులను శుభ్రం చేయవచ్చు. లెదర్‌ షూస్‌, వెండి వస్తువులను కూడా శుభ్రం చేయవచ్చు. అరటి పండు తొక్కలతో సేంద్రీయ ఎరువు తయారు చేసి దాంతో మొక్కలను పెంచవచ్చు. ఇలా అరటి పండ్ల తొక్క‌లు మ‌న‌కు అనేక విధాలుగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. క‌నుక ఈసారి ఈ పండ్ల‌ను తిన్న‌ప్పుడు తొక్క‌ల‌ను ప‌డేయ‌కండి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.