ఆప్రికాట్ గురించి పెద్దగా ఎవరికీ తెలియక పోవచ్చు. ఈ మధ్య దీన్ని కూడా చాలా మంది డ్రై ఫ్రైట్స్‌లో ఒక భాగం చేసుకుంటున్నారు. ఆప్రికాట్‌లో శరీరానికి కావాల్సిన పోషకాలు ఎన్నో ఉన్నాయి.
విటమిన్స్, మినరల్స్, ఖనిజాలు ఎన్నో లభిస్తాయి. దీని ప్రయోజనాలు తెలిస్తే ఖచ్చితంగా తీసుకుంటారు.
ఆప్రికాట్స్‌లో ప్రోటీన్లు, క్యాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ఐరన్, విటమిన్లు ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా అందుతాయి. అంతే కాకుండా కెరోటినాయిడ్స్ వంటి ఫైటో కెమికల్స్ కూడా ఉన్నాయి.
బరువు తగ్గడంలో ఆప్రికాట్స్ చక్కగా సహాయ పడతాయి. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది తినడం వల్ల అతిగా తినే అలవాటును కూడా నిరోధిస్తుంది. దీని ద్వారా సులభంగా మీరు వెయిట్ లాస్ అవ్వొచ్చు.
ఆప్రికాట్‌లో గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరిచే పోషకాలు ఉంటాయి. కాబట్టి గుండె సంబంధిత సమస్యలతో బాధ పడేవారు వీటిని తింటే చాలా మంచిది. డ్రై ఆప్రికాట్ ఫ్రూట్ తినడం వల్ల శరీరంలో రక్త హీనత సమస్య కూడా తగ్గుతుంది.