ఉద్యోగులకు డబుల్‌ జాక్‌పాట్‌.. ఊహించని రీతిలో పెరగనున్న జీతాలు, డీఏ

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులను 8వ వేతన సంఘం ఊరిస్తోంది. ఈ సంఘం అమల్లోకి వస్తే తమకు భారీగా లబ్ధి జరుగుతుందని ఉద్యోగ వర్గాలు భారీ ఆశల్లో మునిగి తేలుతున్నారు. వస్తున్న సమాచారం ప్రకారం వేతనాల పెంపుతోపాటు డీఏ కూడా భారీ స్థాయిలో పెరగనుందని సమాచారం. 8వ వేతన సంఘం అప్‌డేట్‌ ఇలా ఉంది. ఒకసారి చూద్దాం.


త్వరలో అమల్లోకి రానున్న 8వ వేతన సంఘంలో కీలక మార్పులు తీసుకురానుందని తెలుస్తోంది. కొత్త వేతన సంఘం తమ స్థితిగతులు మారుస్తుందని ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారుల్లో భారీ ఆశల్లో మునిగారు. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే వేతనాల్లో భారీగా పెరుగుదల, కరువు భత్యం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుందని చర్చ జరుగుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రభుత్వ ఉద్యోగుల మూల వేతనం 51,000కు పెరిగే అవకాశం ఉందని సమాచారం. 8వ వేతన సంఘం కింద కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే వారికి జీతాలు భారీగా పెరగనున్నాయని చర్చ జరుగుతోంది. వాటికి పింఛన్‌లో కూడా భారీ పెరుగుదల ఉంటుందని తెలుస్తోంది. 8వ వేతన సంఘం అమలుకు సంబంధించి అనేక అప్‌డేట్‌లు జరుగుతున్నాయి.

8వ వేతన సంఘం సిఫార్సులలో ఫిట్‌మెంట్ అంశం ప్రకారం జీతాలలో భారీ పెరుగుదల ఉంటుందని అన్ని నివేదికలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు 20 శాతం నుంచి 30 శాతం వరకు పెరుగుతాయని వార్తలు వస్తున్నాయి. అయితే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ మాత్రం 2.86, 2.28 లేదా 1.90 గా ఉంటుందని అంచనా. ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.90గా ఉండే అవకాశం ఉంది.

ఏడో వేతన సంఘం మొత్తం వేతన పెంపు 14.27 శాతం ఉన్న విషయం తెలిసిందే. ఎనిమిదో వేతన సంఘంలో వేతన పెంపు ఏ స్థాయిలో ఉంటుందనేది ఆసక్తికరంగా ఉంది. ఈసారి ప్రభుత్వం ఎంత సిఫార్సు చేస్తుందోనని ఉద్యోగ వర్గాలు వేయి కళ్లతో వేచి చూస్తున్నాయి.

ప్రస్తుత కరువు భత్యం (డీఏ) ప్రకారం జనవరి 1, 2026 నాటికి డీఏ 60 శాతం నుంచి 62 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత డీఏ 55 శాతం వద్ద ఉంది. 8వ వేతన సంఘంలో కేంద్ర ఉద్యోగులకు 18 శాతం జీతం పెంపుదల లభించనుందని సమాచారం.

కొత్త వేతన సంఘం అంటే 8వ వేతన సంఘం జనవరి 1, 2026 నుంచి అమల్లోకి రానుంది. 8వ వేతన సంఘం సిఫార్సులను అమలు చేయడానికి కొంత సమయం పడుతుంది. 15 నుంచి 18 నెలలు పడుతుందని తెలుస్తోంది. 8వ వేతన సంఘం కోసం నిధులను 2026-27 బడ్జెట్‌లో కేటాయించే అవకాశాలు ఉన్నాయి.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.