మందార పువ్వులతో అందం రెట్టింపు.. ఇలా వాడితే మ్యాజిక్‌లాంటి మెరుపుఖాయం..!

www.mannamweb.com


ప్రతి ఒక్కరూ పువ్వులను ఇష్టపడతారు. పూలు మహిళల అందాన్ని రెట్టింపు చేస్తాయి. పూలు చర్మ సౌందర్యాన్ని సైతం మెరుగుపరుస్తాయి. పూలను రాసుకోవడం వల్ల చర్మ సమస్యలు కూడా దూరం చేసుకోవచ్చు.

అందులో మందారం జుట్టు రాలడాన్ని ఆపడానికి దివ్యౌషధంగా పని చేస్తుంది. అంతే కాకుండా చర్మానికి కావాల్సిన అన్ని ప్రయోజనాలను అందిస్తుంది. మందారంలో ఉండే గుణాలు జుట్టు ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాకుండా వేసవిలో చర్మానికి ఎన్నో లభాలను చేకూర్చుతాయి. ముఖం తెల్లగా, అందంగా మెరిసేలా చేస్తుంది.

మందార పువ్వులను ఎండబెట్టి పొడి చేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో 1 టీస్పూన్ పెరుగు కలిపి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. దీంతో చర్మం మెరుస్తుంది. మందార పువ్వును బాగా ఎండబెట్టి పొడిగా చేసి అందులో ఒక టీస్పూన్ తేనె, నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయండి. 10 నిమిషాల తర్వాత ముఖాన్ని కడుక్కోండి.

ముల్తానీ పేస్ట్‌తో ఎర్రని మందార పూలను రుబ్బి, పెరుగు వేసి ముఖానికి పట్టించాలి. ఇలా చేస్తే ముఖం మెరిసిపోతుంది. మీరు నిద్రపోయే ముందు ఇలా చేయడం ఉత్తమం. ముఖంపై ఉన్న మురికిని తొలగించి ముఖం తెల్లగా మారాలంటే మందార పొడిని పంచదార, శనగపిండి, పచ్చి పాలు కలిపి ముఖానికి రాసుకోవాలి.

మందార పువ్వును గ్రైండ్ చేసి అందులో కలబంద జెల్ కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మీ ముఖం కడుక్కోండి. మీ ముఖం మెరుస్తుంది. టమాటా రసాన్ని మందార పొడిలో వేసి బాగా కలిపి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో మీ ముఖాన్ని కడుక్కోండి. మీ ముఖం మెరిసిపోతుంది.

2 టీస్పూన్ల మందారం పూల పొడిలో సరిపడ పచ్చి పాలు పోసి ఫేస్ ప్యాక్‌ తయారు చేయాలి..దీన్ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాలు ఆరిన తర్వాత కడిగేసుకుంటే సరి. బాగా ఆరిన మందార పూలా పొడి, గ్రీన్ టీ సమానంగా వేసి ప్రత్యేకమైన టీ తయారుచేసుకోవాలి. దీన్ని ముఖానికి ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవాలి. ఆరిపోయిన తర్వాత శుభ్రమైన నీటితో కడిగేయాలి.

మందారం – అలోవెరా జెల్ ఫేస్ ప్యాక్ కూడా అద్భతం చేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ ని అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.