తామర ఆకుల నుంచి తయారు చేసిన టీ అనేది ఒక రకమైన హెర్బల్ టీ. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఈ టీని ఎండిన తామర ఆకులతో తయారు చేస్తారు. తామర ఆకుల టీ తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.
దీనితో అనేక రకాల చిన్నా పెద్ద సమస్యల నుండి శరీరాన్ని కాపాడుకోవచ్చు. మొదట చైనాలో ఈ టీని ఎక్కువగా తాగేవారు. ఇప్పుడు ఆసియా అంతట ఫేమస్ అయ్యిది.
తామర ఆకులతో తయారు చేసిన టీ తాగితే అందులో పోటాషియం ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. తామర ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకులతో తయారు చేసిన టీ తాగితే శరీరంలో వాపు, చికాకు తగ్గుతుంది.
తామర ఆకుల్లో జీవక్రియను పెంచేందుకు సహాయపడే పోషకాలు ఉన్నాయి. ఇవి వేగంగా బరువు తగ్గేందుకు దారి తీస్తాయి. తామర ఆకులతో తయారు చేసిన టీలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
తామర ఆకుల్లో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచి గుండెను కాపాడుతాయి. లోటస్ టీ తాగడం ద్వారా శరీర నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. దీనివల్ల వాపు కూడా తగ్గుతుంది. తామర ఆకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి.
లోటస్ టీ తాగడం ద్వారా ఒత్తిడి, ఆందోళనను నివారించవచ్చు. ఈ పువ్వులో ఉండే పోషకాలు మిమ్మల్ని రిలాక్స్‌గా చేస్తాయి. మీరు చాలా అలసిపోయినట్లు అనిపిస్తే, లోటస్ టీ తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో శరీరంలో ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది.