కొన్నిసార్లు మంచి ఆరోగ్యం కోసం చల్లని నీటికి బదులుగా వేడి నీటిని తాగాలని సలహా ఇస్తారు. మరికొందరు బరువు తగ్గడానికి నిరంతరం వేడి నీటిని తాగుతారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి వైరల్ వ్యాధులలో వేడి నీటిని తాగడం మంచిది. అలాగని కొందరు ఎక్కువ సార్లు వేడి నీటిని మాత్రమే తాగుతుంటారు. కానీ శరీరంపై దాని ప్రభావం ఎలా ఉంటుందో వారికి పెద్దగా తెలియదు. అయితే, రోజుకు ఎనిమిది గ్లాసుల వేడినీరు తాగితే ఏమవుతుందో తెలుసా..?
నీరు మన శరీరానికి చాలా అవసరం. నీరు లేనిదే జీవం లేదన్నారు. నీరు లేకుండా మనం జీవించలేము. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీరు తాగిన తర్వాతే రోజును ప్రారంభించడం ఆరోగ్యకరం. మరీ ముఖ్యంగా వేసవిలో నీరు ఎక్కువగా తాగడం శరీరానికి చాలా అవసరం. నిరంతరం చెమట పట్టడం వల్ల శరీరంలో నీరు తగ్గిపోయి, డీహైడ్రేషన్‌కు దారి తీస్తుంది. ఇలాంటప్పుడు శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి ఎక్కువగా నీరు తాగడం అవసరం. అయితే, వేడినీరు తాగడం మీ శరీరానికి మంచిదేనా? కొన్నిసార్లు మంచి ఆరోగ్యం కోసం చల్లని నీటికి బదులుగా వేడి నీటిని తాగాలని సలహా ఇస్తారు. మరికొందరు బరువు తగ్గడానికి నిరంతరం వేడి నీటిని తాగుతారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి వైరల్ వ్యాధులలో వేడి నీటిని తాగడం మంచిది. అలాగని కొందరు ఎక్కువ సార్లు వేడి నీటిని మాత్రమే తాగుతుంటారు. కానీ శరీరంపై దాని ప్రభావం ఎలా ఉంటుందో వారికి పెద్దగా తెలియదు. అయితే, రోజుకు ఎనిమిది గ్లాసుల వేడినీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు, సైడ్‌ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం..
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది..
వేడి నీటిని తాగడం వల్ల అజీర్ణం నుండి ఉపశమనం లభిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణక్రియ సక్రమంగా ఉంటే గ్యాస్ లేదా ఎసిడిటీ ఉండదు. అలాగే, వేడి నీరు జీర్ణక్రియకు ఆటంకం కలిగించే కడుపులోని విషయాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది.
బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది..
వేడి నీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రోజు తిన్న తర్వాత గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. బరువు పెరగకుండా అదుపులో ఉంచుతుంది. దీనితో పాటు వేడినీరు తాగడం వల్ల విపరీతమైన ఆకలి ఉండదు.
హైడ్రేట్ చేయడానికి సహాయం చేస్తుంది..
ఉదయం నిద్ర లేవగానే రాత్రి పడుకునే ముందు వేడినీళ్లు తాగితే ఆ నీరు శరీరం హైడ్రేటెడ్ గా ఉండేలా చేస్తుంది.
* వేడినీరు తాగడం వల్ల కలిగే నష్టాలు కూడా ఉన్నాయి.. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
గొంతులో మంట: వేడి నీటిని ఎక్కువగా తాగడం వల్ల నోరు, గొంతు, పొట్టలో మంట మొదలవుతుంది. కాబట్టి నీటిని త్రాగేటప్పుడు, సాధారణ ఉష్ణోగ్రత లేదా గోరువెచ్చని నీటిని మాత్రమే తాగాలి.
అంతర్గత అవయవాలకు నష్టం: వేడి నీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని అంతర్గత అవయవాలపై కూడా చెడు ప్రభావం పడుతుంది. ఎక్కువ వేడి నీరు కడుపు చికాకు కలిగిస్తుంది. శరీరం అంతర్గత కణజాలాలు సున్నితంగా ఉంటాయి. వేడి నీరు ఎక్కువగా తాగితే.. ఇది బొబ్బలకు దారితీస్తుంది.
అన్నవాహిక దెబ్బతింటుంది: వేడినీరు తాగడం అన్నవాహికపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఇది నోటిని, కడుపుని కలిపే అన్నవాహిక. వేడినీరు తాగడం వల్ల ఈ అన్నవాహిక దెబ్బతింటుంది. దీనితో పాటు, మంట కూడా మొదలవుతుంది. ఈ నొప్పి దీర్ఘకాలికమైనది.
అందుకే వేడినీరు త్రాగేటప్పుడు, నీరు చాలా వేడిగా ఉండకుండా చూసుకోండి. రోజుకు ఎనిమిది గ్లాసుల వేడినీరు తాగడం వల్ల వివిధ ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. అలాగే, ప్రతి ఒక్కరూ ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే.. నీరు గోరువెచ్చగా ఉండేలా చూసుకోండి. ఎక్కువ వేడిగా ఉండకూడదు.