నిలబడి ఫాస్ట్‌గా వాటర్ తాగేస్తున్నారా.. ఈ విషయాలు మీ కోసమే

www.mannamweb.com


దాహంగా అనిపించడం వల్ల నీళ్లు తాగుతూ ఉంటాం. సందర్భం బట్టి కూర్చొని, నిల్చుని తాగుతూ ఉంటారు. ఒక్కోసారి బాగా దాహంగా ఉన్నా.. ఏదన్నా కంగారులో ఉన్నా నీళ్లను గబగబా తాగేస్తూ ఉంటాం.

ఒక్కోసారి ఫ్రిడ్జ్ దగ్గర లేదా బిందె తగ్గర నిల్చుని నీళ్లు తాగుతూ ఉంటారు. నీళ్లను తాగడం మంచిదే. నీళ్లు తాగడం వల్ల శరీరంలో ఉన్న మలినాలు, విష పదార్థాలు అన్నీ బయటకు పోతాయి. బాడీ కూడా హైడ్రేట్‌గా ఉంటుంది. నీళ్లను తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కానీ నీటిని తాగేందుకు కూడా నియమాలు ఉన్నాయన్న సంగతి చాలా మందికి తెలీదు. నిలబడి నీళ్లు తాగడం చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇటీవల పలు అధ్యయనాల్లో ఈ విషయాలు బయట పడ్డాయి. మరి నీటిని ఎలా తాగాలో ఇప్పుడు చూద్దాం.

కూర్చొని తాగాలి:

నీటిని ఎప్పుడైనా సరే నిలబడి తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ విషయం మీకు ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజమే. నిలబడి కంటే కూర్చొని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని అంటున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నీటిని నిలబడి తాగడం వల్ల పోషకాలు సరిగా అందవు. పొత్తి కడుపుపై ఎఫెక్ట్ పడుతుంది. అలాగే మూత్ర పిండాలపై కూడా ఒత్తిడి అధికం అవుతుందని వెల్లడిస్తున్నారు.

ఫాస్ట్‌గా అస్సలు తాగకూడదు:

ఎప్పుడైనా సరే.. ఎంత కంగారులో ఉన్నా నీళ్లను అస్సలు ఫాస్ట్‌గా తాగకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎంత దాహం వేసినా.. అలసి పోయినా గబగబా తాగకూడదట. నెమ్మదిగా తాగుతూ ఉండాలి. అప్పుడే మీ జీర్ణ వ్యవస్థపై ఎఫెక్ట్ పడకుండా.. ఈ నీరు బలోపేతం చేయడంలో సహాయ పడుతుంది.

ప్లాస్టిక్‌కి స్వస్తి పలకండి:

ప్లాస్టిక్ ఏదైనా ప్లాస్టిక్కే. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌లో సాధ్యమైనంత వరకు నీరు తాగకుండా ఉండాలని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఎందుకంటే ఈ నీరు తాగడం వల్ల మనిషి రక్తంలో క్యాన్సర్‌కు కారణం అయ్యే మైక్రోప్లాస్టిక్‌లు చేరుతున్నాయట. సూర్య రశ్మి ప్లాస్టిక్‌పై పడటం వల్ల నీటిలోకి మైక్రోప్లాస్టిక్‌లు విడుదల అవుతున్నాయి. కాబట్టి వీలైనంత వరకు ప్లాస్టిక్‌ని ఉపయోగించకండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే._)