ప్రకృతి చాలా విచిత్రమైనది. ప్రపంచంలో ఏదో ఒక ప్రాంతంలో కుంభవృష్టితో వరదలు వస్తుంటే, మరో ప్రాంతంలో కరవు తాండవిస్తుంటుంది. అలాగే, భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో ఎండలు మండిపోతుంటే, ధ్రువాలకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో చలి వణికిస్తుంది. కానీ ఈ భూమండలంపై ఓ ప్రాంతంలో ఏకంగా 20 లక్షల ఏళ్లుగా వర్షం జాడే లేదట. వరుసగా ఐదారేళ్లు వర్షం పడని ప్రాంతాలు చూశాం కానీ, ఇలా లక్షల ఏళ్లుగా వర్షం కురవని ప్రాంతం ఉంటుందా?
ప్రకృతి చాలా విచిత్రమైనది. ప్రపంచంలో ఏదో ఒక ప్రాంతంలో కుంభవృష్టితో వరదలు వస్తుంటే, మరో ప్రాంతంలో కరవు తాండవిస్తుంటుంది. అలాగే, భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో ఎండలు మండిపోతుంటే, ధ్రువాలకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో చలి వణికిస్తుంది. కానీ ఈ భూమండలంపై ఓ ప్రాంతంలో ఏకంగా 20 లక్షల ఏళ్లుగా వర్షం జాడే లేదట. వరుసగా ఐదారేళ్లు వర్షం పడని ప్రాంతాలు చూశాం కానీ, ఇలా లక్షల ఏళ్లుగా వర్షం కురవని ప్రాంతం ఉంటుందా? అనిపిస్తుంది కదా.. నిజమే కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రదేశం ఏ సహారా ఎడారో కాదు, ఆశ్చర్యంగా ఇటీవల ఎడారి దేశం ఎమిరేట్స్‌ను వర్షాలు ముంచెత్తాయి. అలాంటిది ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉండే ప్రాంతంలో లక్షల ఏళ్లుగా వర్షం పడలేదంటే నమ్మశక్యంగా లేదు కదా. కానీ ఇది నిజం. ఎక్కడంటే ఎటు చూసినా కిలోమీటర్ల ఎత్తున మంచుతో కప్పబడి ఉన్న అంటార్కిటికా ఖండంలో అలాంటి కరువు ప్రాంతం ఉంది.