ఇంగ్లీషులో కొన్ని పదాల్లో ఒక్క అక్షరం మారినా వాటి అర్థమే మారుతుంది.ఉదాహరణకు BAD కు బదులుగా BED అని రాస్తే దాని అర్థం పూర్తిగా మారిపోతుంది. ఇలా అక్షరం మార్పుతో 13 మంది టీచర్ల జీతాలు కట్ కట్ కావడమే కాదు..ఉపాధ్యాయ సంఘాల ఆందోళకు దారితీసింది. Bed performanceపేరుతో 13 మంది టీచర్ల జీతా లు కట్ చేస్తూ విద్యాశాఖ అధికారులు లెటర్ రాశారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. అధికారుల తీరును ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు చెపట్టాయి. వివరాల్లోకి వెళితే..
బీహార్‌లోని జాముయి జిల్లా విద్యాశాఖ ఘనకార్యం వెలుగులోకి వచ్చింది. విద్యా శాఖ లేఖ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, దీని గురించి ప్రజలు రకరకాల చర్చలు జరుపుతున్నారు. డ్యూటీ లకు గైర్హాజరైన టీచర్లకు బెడ్ ఫర్మార్మెన్స్ కారణంగా 13 మంది ఉపాధ్యాయుల జీతాన్ని విద్యాశాఖ కట్ చేసింది. ఇది ఉపాధ్యాయ సంఘాల నుంచి నిరసనలను రేకెత్తించింది.
మే 22న జాముయి జిల్లా పరిధిలోని వివిధ పాఠశాలల్లో ఆకస్మిక తనఖీలు నిర్వహించిన అధికారులు పలువురు ఉపాధ్యాయులు విధులకు గైర్హాజరైనట్టు తెలిపారు. చాలామంది ఉపాధ్యాయుల పనితీరు కూడా సంతృప్తికరంగా లేదని తేలింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారి తప్పు చేసిన ఉపాధ్యాయులపై చర్యలకు ఆదేశాలు జారీ చేస్తూ లేఖ రాసింది. అయితే ఆ లేఖలోని అంశాలు.. ఉపాధ్యాయుల కంటే విద్యాశాఖనే తప్పుపట్టేలా కనిపించాయి.
లేఖలో పేర్కొన్ ప్రకారం.. 13 మంది ఉపాధ్యాయుల జీతం Bed performance కారణంగా తగ్గించబడింది.Bad Performance కు బదులుగా Bed Performance అని లేఖలో పొరపాటున టైప్ చేయబడింది.ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగాయి. విషయం తెలుసుకున్న డీఈవో కార్యాల యం హడావుడిగా క్లారిటీ ఇచ్చింది. టైపింగ్ లోపం కారణంగా బ్యాడ్ పెర్పార్మెన్స్ అని బదులుగా బెడ్ ఫెర్మార్మెన్స్ అని టైప్ చేశారు. అని డీఈవో సంజాయిషీ ఇచ్చు కుంది.