ఎలక్ట్రానిక్ వాహనాలకు క్రమ క్రమంగా ఆదరణ పెరుగుతోంది. వరల్డ్ వైడ్ గా ఈవీలను కొనేందుకు వాహనదారులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్లు, కార్లు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. బడ్జెట్ ధరల్లోనే ఎలక్ట్రిక్ వాహనాలు లభిస్తుండడంతో కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈవీల వాడకంతో ప్రయాణ ఖర్చులు కూడా తగ్గుతున్నాయి. డ్రైవ్ చేసేందుకు కూడా ఈజీగా ఉండడంతో మహిళలు, కాలేజ్ కి వెళ్లే యువతులు ఈవీ స్కూటర్లను కొనేస్తున్నారు. పర్యావరణ హితంగా ఉండడంతో ఈవీలకు డిమాండ్ పెరుగుతోంది. పెట్రోల్ ధరలు పెరగడం కూడా ఈవీల కొనుగోలుకు కారణమవుతున్నాయి.
ఈవీలకు వస్తున్న ఆదరణతో ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు అడ్వాన్స్డ్ ఫీచర్లతో సరికొత్త స్కూటర్స్ ను రూపొందిస్తున్నాయి. బెస్ట్ ఫీచర్లతో తక్కువ ధరలతోనే మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. మరి మీరు కూడా తక్కువ ధరలో క్రేజీ ఫీచర్లు ఉండే ఈవీ కోసం చూస్తున్నారా? అయితే మీకు ఇదే మంచి ఛాన్స్. దిగ్గజ ఈవీ తయారీ సంస్థ ఓలా 50 వేలకే బెస్ట్ స్కూటర్ ను అందిస్తోంది. దసరా పండగ వేళ ఓలా కంపెనీ ఆఫర్ల వర్షాన్ని కురిపిస్తోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు, సేల్స్ ను పెంచుకునేందుకు స్కూటర్ల ధరలను తగ్గించి స్పెషల్ ఆఫర్లను అందిస్తోంది. మరి మీరు ఈ మధ్యకాలంలో కొత్త ఈవీని కొనాలని ప్లాన్ చేస్తే ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఓలా కంపెనీ ఎస్1 ఎక్స్ స్కూటర్ పై దసరా ధమాకా ఆఫర్ ను ప్రకటించింది.
బిగ్గెస్ట్ ఓలా సీజన్ సేల్‌ను అక్టోబర్ 3 (గురువారం) నుంచి ప్రారంభించింది. ఈ ఆఫర్లో భాగంగా ఈ స్కూటర్ ను రూ. 49,999 కే అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 70 వేలుగా ఉండేది. అంటే మీకు ఇప్పుడు 20 వేల తగ్గింపుతో వస్తుందన్నమాట. స్టాక్ ఉన్నంత వరకే తక్కువ ధరకు ఈ స్కూటర్ ను విక్రయించనున్నట్లు తెలిపింది. ఇంకా.. హైపర్ ఛార్జింగ్ క్రెడిట్స్, మూవ్‌ఓస్ ప్లస్ అప్‌గ్రేడ్, యాక్సెసరీస్‌లపై డీల్స్ వంటి సుమారు రూ. 40 వేల విలువైన బెనిఫిట్స్‌ను ఫెస్టివ్ ఆఫర్ కింద అందిస్తుంది ఓలా కంపెనీ. ఓలా ఎస్1 ఎక్స్ 2 కిలో వాట్ అవర్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది. ఈ స్కూటర్ సింగిల్ చార్జ్ తో 95 కి.మీలు ప్రయాణించొచ్చని కంపెనీ తెలిపింది.
గంటకు 85 కిమీల వేగంతో ప్రయాణిస్తుందని సంస్థ వెల్లడించింది. ఎస్1 ఎక్స్ 2kwh బ్యాటరీపై రూ. 25 వేల ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తుంది. ఇంకా.. ఎస్ 1 పోర్ట్ ఫోలియోపై రూ. 15 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది కంపెనీ. రూ. 7 వేల విలువైన 8 ఏళ్లు లేదా 80 వేల కిలోమీటర్ల బ్యాటరీ వారెంటీ కూడా ఫ్రీ. ఎంపిక చేసిన కొన్ని క్రెడిట్ కార్డు ఈఎంఐలపై రూ. 5 వేల వరకు తగ్గింపు ఉంది. రూ. 6 వేల విలువైన మూవ్ OS+ అప్‌గ్రేడ్, రూ. 7 వేల విలువైన హైపర్ ఛార్జింగ్ క్రెడిట్స్ ఉచితంగా అందించనుంది ఓలా ఎలక్ట్రిక్. 50 వేలకే Ola స్కూటర్ ఆఫర్.