మెదడు క్యాన్సర్ ప్రారంభ సంకేతాలు.. తలనొప్పి తరచుగా వస్తుంటే జాగ్రత్త

మెదడు క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించడం కష్టం. ఎందుకంటే దాని లక్షణాలు చాలావరకు సాధారణ తలనొప్పిలాగే ఉంటాయి. అందుకే చాలామంది మొదట్లో వాటిని పెద్దగా పట్టించుకోరు.


మరి ఆ లక్షణాలు ఎలా గుర్తించాలో చూసేద్దాం.

తలనొప్పి తరచుగా రావడం లేదా.. పరిస్థితి తీవ్రంగా మారితే అది సాధారణ తలనొప్పి కాదు. మందులకు అదుపులోకి మారకపోయినా కూడా సాధారణ తలనొప్పి అనుకోకూడదని చెప్తున్నారు. ఇది బ్రెయిన్ క్యాన్సర్​ ప్రమాదానికి సంకేతం కావచ్చు. ఇలా తలనొప్పి వచ్చినప్పుడు వాంతులు లేదా వికారంతో కూడా అనిపిస్తుంది.

మెదడు కణితి దృష్టి నరాలపై లేదా విజువల్ ప్రాసెసింగ్ భాగంపై ఒత్తిడి తెస్తుంది. అది కంటిచూపును ప్రభావితం చేస్తుంది. దీనివల్ల అస్పష్టంగా కనిపించడం, డబుల్ విజన్ లేదా అకస్మాత్తుగా దృష్టి మందగించడం వంటివి జరుగుతాయి. ఈ మార్పులు నెమ్మదిగా జరుగుతాయి. ఇవి సాధారణమైనవి అనుకోకూడదట.

పెద్దవారిలో మొదటిసారిగా ఫిట్స్ రావడం చాలా తీవ్రమైన సంకేతంగా పరిగణిస్తారు. ఈ కణితులు మెదడులోని అనేక కార్యకలాపాలను నిరోధిస్తాయి. వీటివల్ల శరీరంలోని ఏదైనా భాగంలో వణుకు వస్తుంది. శరీరంలో తిమ్మిరి లేదా కొన్ని సెకన్ల పాటు మాట్లాడటంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి.

మెదడు క్యాన్సర్ ప్రభావం శరీరంపైనే కాదు.. మానసిక సామర్థ్యం, ప్రవర్తనపై కూడా కనిపిస్తుంది. కణితి ఫ్రంటల్ లోబ్ లేదా ఇతర భాగంలో ఉంటే.. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, మూడ్ కంట్రోల్ వంటి సమస్యలు వస్తాయి. చిరాకు, విచారం, ఆందోళన లేదా పదేపదే మరచిపోవడం వంటివి కూడా జరుగుతాయి.

మెదడులో ఒత్తిడి ఏర్పడటం వల్ల శరీర సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల పదేపదే తడబడతారు. మైకం, సరిగ్గా నడవలేకపోవడం లేదా చేతులు, కాళ్లు బలహీనంగా మారడం జరుగుతాయి. ఈ లక్షణాలు శరీరంలో ఒక భాగంలో మాత్రమే కనిపిస్తే.. కణితి ఉన్నట్లేనని చెప్తున్నారు.

చాలాసార్లు తలనొప్పులు తక్కువసేపు ఉంటాయి. మందులతో కంట్రోల్ అవుతాయి. కానీ నొప్పి విభిన్నంగా అనిపిస్తే.. పదేపదే వస్తే.. ఈ అసాధారణ లక్షణాలు తేలికగా తీసుకోకూడదు. సకాలంలో వైద్యుడిని సంప్రదిస్తే మంచిది. వీలైనంత త్వరగా టెస్ట్​లు చేయించుకోవడం మంచిది. ప్రారంభదశలోనే చికిత్స అందిస్తే బ్రెయిన్ క్యాన్సర్ ప్రమాదం దూరమవుతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.