ఎప్పుడైనా ఒక కొత్త ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. అందరికంటే వినూత్నంగా ఆలోచిస్తే.. బిజినెస్‌లో మీరే టాప్ ఉంటారు. దీంతో పాటే డబ్బు కూడా మీ సొంతం అవుతుంది.
సాధారణంగా ప్రజలు డబ్బు సంపాదించడానికి ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తూ ఉంటారు. ఎందులో సక్సెస్ అవ్వాలన్నా కాస్త ఓపిక ఉండాలి. ఈ ప్రయత్నాల్లో చాలా మంది ఫెయిల్ అయి నష్టాలను చవి చూస్తూ ఉంటారు. కానీ అధైర్య పడకుండా ఉన్నవాటిల్లో కొత్తగా ఆలోచిస్తే.. పోయిన డబ్బు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేస్తుంది.
ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ మహిళ కూడా ఎవరి ఊహకు అందకుండా వ్యాపారాన్ని స్టార్ట్ చేసింది. యూకేకి చెందని ఈ మహిళ పేరు హన్నా. వాడి పడేసే దుస్తులను అమ్మి డబ్బు సంపాదిస్తుంది. అంతే కాకుండా ఈమె ఓ పాపులర్ టెక్‌టాకర్. ఈ క్రమంలోనే ఆమె బిజినెస్ గురించి చెప్తూ టిప్స్ షేర్ చేస్తూ ఉంది. దీంతో ఈ విషయం కాస్తా వైరల్ అయింది. చాలా మందిని ఈ విషయం ఆశ్చర్యానికి గురిచేసింది. వాడి పడేసిన బట్టలతో డబ్బులు ఎలా సంపాదించాలో కొన్ని వీడియోల ద్వారా షేర్ చేసుకుంది.
హన్నా తాను వాడిన దుస్తులను నగలను, బూట్లను ఆన్‌లైన్‌లో ప్లేస్ వింటెడ్‌లో తక్కువ ధరకు అమ్మడం మొదలు పెట్టింది. చాలా మంది చవకైనా సెకండ్ హ్యాండ్ వస్తువులను కొంటూ ఉంటారు. ఇలా ఆమెకు ప్రాఫిట్ రావడం మొదలయ్యింది. దీంతో మరి కొందరి దగ్గర.. వాడేసిన దుస్తులు, నగలు, చెప్పులు వంటివి కొని.. ఆన్‌లైన్‌లో అమ్మడం స్టార్ట్ చేసింది.
ఈ ఫ్లాట్ ఫామ్‌లో సెల్లార్స్‌కి ఎలాంటి ఫీజు లేదు. కానీ బయ్యర్స్‌కి మాత్రం కొంత ఛార్జ్ చెల్లించాలి. ఈ బిజినెస్‌తో హన్నా ఏకంగా రూ.6,44,330 సంపాదించినట్టు వెల్లడించింది. హన్నాకు వచ్చిన ఈ ఐడియా తెలుసుకుని చాలా మంది నోరెళ్ల బెడుతున్నారు. తెలివి ఉండాలే కానీ.. ఎలా అయినా మనం బిజినెస్ స్టార్ట్ చేసి.. ట్రెండ్ అవ్వొచ్చని హన్నానే నిదర్శనంగా నిలుస్తోంది. ఇక ఈ విషయం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.