Easy kitchen Tips: గోధుమ పిండిలో ఈ ఒక్కటి కలిపారంటే చపాతీ దూదిలా.. మెత్తగా.. వస్తుంది! మీరూ ట్రై చేయండి..

చపాతీ తినడానికి ఎవరు ఇష్టపడరు! శీతాకాలంలో వేడి వేడి చపాతీ తింటే ఆ మజానే వేరు. చపాతీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దానివల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
చపాతీ తినడం వల్ల మలబద్ధకం సమస్య సులభంగా తొలగిపోతుంది. అంతేకాకుండా చపాతీలో ఫోలేట్, ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్, సెలీనియం, పొటాషియంతోపాటు కొంత మొత్తంలో చక్కెర కూడా ఉంటుంది.


కాబట్టి చపాతీ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. తృణధాన్యాలతో కూడా చపాతీ చేసుకోవచ్చు. ఇలాంటి చపాతీలు తినడం వల్ల పోషకాలు పుష్కలంగా అందుతాయి. అయితే చాలా మందికి చపాతీ మెత్తగా, మృదువుగా చేయడం రాదు. చపాతీ మెత్తగా రావాలంటే పిండిలో ఈ ఒక్కటి కలపాలి.. అదేంటో తెలుసుకుందాం..

ముందుగా పిండిని తీసుకుని అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. అందులో 2 స్పూన్ల ఓట్స్ పౌడర్ కలపాలి. తర్వాత గోరువెచ్చని పాలు, కాసిన్ని నీళ్లుపోసి చపాతీ పిండి కలుపుకోవాలి. ఎక్కడికైనా దూర ప్రయాణం చేసేవారు, లేదా ఆఫీసుకు వెళ్లేటప్పుడు, పాలు కలిపి చపాతీ తయారు చేస్తే రుచితోపాటు మెత్తగా కూడా వస్తుంది.

ఇలా చపాతీ చేయడం వల్ల ఎలాంటి జీర్ణ సమస్యలు రావు. తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా చపాతీ చేయడం వల్ల గ్యాస్ హార్ట్ బర్న్ సమస్య ఉండదు. పాలు ఇష్టపడని వారు పుల్లటి పెరుగుతో కూడా పిండిని కలుపుకోవచ్చు.

మల్టీగ్రెయిన్ పిండి ఇప్పుడు మార్కెట్‌లో కూడా అందుబాటులో ఉంది. ఆ పిండి ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇలా చేస్తే తినడానికి చాలా బాగుంటుంది. ఆరోగ్యంగా కూడా మేలు చేస్తుంది.