దాల్చిన చెక్కను వంటల్లో వాడుతూనే ఉంటారు. దీని వల్ల రుచి పెరుగుతుంది. అయితే..ఇదే సమయంలో ఆరోగ్యమూ అందుతుంది. దాల్చిన చెక్కను వీలైనంత వరకూ నేరుగా తినడం మంచిది.
పరగడుపున ఓ ముక్క తీసుకుంటే జీర్ణ సమస్యలు తగ్గడం సహా మలబద్ధకం నుంచి రిలీఫ్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దాల్చిన చెక్కలో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ ఫ్లమేషన్ గుణాలున్నాయి. వరోజూ పరగడుపున తినడం ద్వారా ఈ గుణాలన్నీ శరీరానికి అందుతాయి.
దాల్చిన చెక్కను వంటలో చాలా విరివిగా వాడుతుంటారు. మసాలాలో తప్పనిసరిగా దాల్చిన చెక్క ఉండాల్సిందే. కాస్తంత ఫ్లేవర్ రావాలన్నా, రుచిగా అనిపించాలన్నా దాల్చిన చెక్క యాడ్ చేసేస్తుంటారు. అయితే..కేవలం రుచికే కాదు. ఆరోగ్యానికి కూడా ఇది ఎంతగానో తోడ్పడుతుంది. పైగా ఇందులో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. ఆయుర్వేదంలో ఎక్కువగా దాల్చిన చెక్క వాడుతుంటారు.
ఇమ్యూనిటీని పెంచడం నుంచి జీర్ణ సమస్యలు తగ్గించడం వరకూ ఎన్నో విధాలుగా ఇది సహకరిస్తుంది. అయితే..దాల్చిన చెక్కను ఎన్నో విధాలుగా ఆహారంలో చేర్చుకోవచ్చు. అయితే..ఇప్పుడు చెప్పిన విధంగా తీసుకుంటే మాత్రం అన్ని రకాల సమస్యలను దూరం చేసుకోవచ్చని ఎక్స్ పర్ట్స్ చెబుతన్నారు. ఆ వివరాలేంటో చూద్దాం.దాల్చిన చెక్క ఉపయోగాలు
ఇది కీలక పాత్ర పోషిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడడం నుంచి జీర్ణ క్రియని మెరుగుపరచడం, బరువు తగ్గించడం, రోగనిరోధక శక్తిని పెంచడం సహా మరెన్నో ప్రయోజనాలున్నాయి. అయితే..క్యాన్సర్ కణాలు పెరగకుండా కూడా దాల్చిన చెక్క అడ్డుకుంటుంది. ఇక ఇందులో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడంలోనూ దాల్చిన చెక్క మంచి మెడిసిన్ లా పని చేస్తుంది. దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థకు మేలు చేయడంతోపాటు వాంతులు, వికారం లాంటి వాటి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
పరగడుపున తీసుకుంటే
ద్వారా ఎంతో ఆరోగ్యం లభిస్తుందని చెబుతున్నారు ఎక్స్ పర్ట్స్. ముఖ్యంగా ఇదొక బెరడు. ఈ బెరడులోని ఇప్పుడు చెప్పుకున్న గుణాలన్నీ ఉంటాయి. దాల్చిన చెక్కకు శాస్త్రీయ నామం Cinnamomum. మార్కెట్లో చాలా సులువుగా దొరుకుతుంది. ఇందులో రెండు మూడు రకాలుంటాయి. అయితే..మార్కెట్ లో మాత్రం విరివిగా ఓ రకం అందుబాటులో ఉంటుంది. మెటబాలిజం మెరుగుపరుచుకునేందుకు తప్పనిసరిగా రోజూ దాల్చిన చెక్కను డైట్ లో చేరచుకోవాల్సి ఉంటుంది. ఓ చిన్న దాల్చిన చెక్క ముక్కను ఉదయమే పరగడుపున తినడం ద్వారా అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి అందుతాయి. ఇవి వృద్ధాప్యాన్ని అడ్డుకోవడంతో పాటు నేచురల్ డిటాక్స్ లా పని చేస్తుంది.
వర్కౌట్స్ తరవాత
జాయింట్ పెయిన్స్ తో ఇబ్బందులు పడతారు. అయితే..రెగ్యులర్ గా పరగడుపున దాల్చిన చెక్క తినడం ద్వారా ఈ ఇన్ ఫ్లమేషన్ తగ్గిపోతుంది. తద్వారా కీళ్ల నొప్పుల నుంచి రిలీఫ్ లభిస్తుంది. ఇక దాల్చిన చెక్క వల్ల మెదడు కూడా చురుగ్గా మారుతుంది. ఇదో బ్రెయిన్ బూస్టర్ లా పని చేస్తుంది. మతి మరుపు రాకుండా చూస్తుంది. వయసుతో పాటు వచ్చే ఇతరత్రా సమస్యల్నీ తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ కారణంగా చర్మం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా డెడ్ సెల్స్ అన్నీ తొలగిపోయి కొత్త మెరుపు వస్తుంది.
యాంటీ మైక్రోబయల్ గుణాలు
దాల్చిన చెక్కలో యాంటీ మైక్రోబయల్ గుణాలు అధికంగా ఉంటాయి. హానికర బ్యాక్టీరియా, ఫంగస్ నుంచి ఇది కాపాడుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా ఇది ఎంతగానో తోడ్పడుతుంది. రోజూ దాల్చిన చెక్క పరగడుపున తినడం ద్వారా కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. ముఖ్యంగా మంచి కొలెస్ట్రాల్ పెంచడంలో ఇది సాయపడుతుంది. ఇక జీర్ణ సమస్యలను తీర్చడంలోనూ దాల్చిన చెక్కదే కీలక పాత్ర. ఉదయమే గ్యాస్, అసిడిటీతో ఇబ్బంది పడుతున్న వారు పరగడుపున ఓ చిన్న దాల్చిన చెక్క ముక్క తింటే చాలు. చాలా త్వరగా రిలీఫ్ వచ్చేస్తుంది. ఇక మలబద్ధకంతో ఇబ్బందులు పడుతున్న వారు రోజూ దాల్చిన చెక్క తింటే ఉపశమనం పొందవచ్చు.పొట్ట ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలుతగ్గిపోతాయి. కూరలలో కాస్తంత ఎక్కువగా దాల్చిన చెక్క వేసుకుంటే సరిపోతుంది. లేదా దాల్చిన చెక్క టీ తాగినా ప్రయోజనాలు అందుతాయి.
బరువు తగ్గేందుకు
బరువు తగ్గడానికి కూడా దాల్చిన చెక్క ఎంతగానో తోడ్పడుతుంది. ముఖ్యంగా కొవ్వు పేరుకుపోకుండా ఇది అడ్డుకుంటుంది. మెటబాలిజం మెరుగవడంతో పాటు అనారోగ్యకరమైన ఆకలిని తగ్గిస్తుంది. అదే సమయంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా అడ్డుకుంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఎలాంటి క్యాన్సర్ కణాలు పెరగకుండా చూస్తాయి. ఇక మెదడు చురుగ్గా పని చేయడంతో పాటు మతిమరుపుని తగ్గించండలోనూ దాల్చిన చెక్క సాయపడుతుంది. ముఖ్యంగా అల్జీమర్స్ రాకుండా చూస్తుంది. దాల్చిన చెక్క ఆరోగ్యానికి మంచిదే అయినా మితంగా వాడడం బెటర్. ఎక్కువ మొత్తంలో తీసుకున్నప్పుడు దాల్చిన చెక్కలో ఉండే కౌమరిన్ అనే కంపౌండ్ కారణంగా శరీరానికి హాని కలిగే ముప్పు ఉంటుంది.
గమనిక
ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించేముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.
































