డేలో ఫస్ట్ మీల్ అయిన బ్రేక్ ఫాస్ట్ లో చాలా మంది ఇడ్లీ, దోసె, చపాతి, పూరీ ( Idli, Dosa, Chapati, Puri )వంటి ఆహారాలను తీసుకుంటారు. అయితే వాటి వల్ల ఆరోగ్యానికి ఎంత ప్రయోజనం ఉంది అన్నది పక్కన పెడితే..
బ్రేక్ ఫాస్ట్ లో ఓవర్ నైట్ ఓట్స్ ను తీసుకుంటే మాత్రం హెల్త్ పరంగా చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. పైగా ఓవర్ నైట్ ఓట్స్ ను తయారు చేసుకోవడం కూడా ఎంతో సులభం.
అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు రోల్డ్ ఓట్స్( Rolled oats ) వేసుకోవాలి. అలాగే వన్ టీ స్పూన్ చియా సీడ్స్,( Chia seeds ) వన్ టేబుల్ స్పూన్ బాదం పలుకులు( Almond nuts ), వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు( Cashew nuts ), వన్ టేబుల్ స్పూన్ వాల్ నట్ పలుకులు, రెండు టేబుల్ స్పూన్లు ఎండుద్రాక్ష, వన్ టేబుల్ స్పూన్ బెల్లం పొడి లేదా తేనె, ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక అరటి పండును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని మూత పెట్టి నైట్ అంతా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి.
ఉదయాన్నే ఆ ఓట్స్ ను తీసుకుని నేరుగా తినేయడమే. బ్రేక్ ఫాస్ట్ లో ఓవర్ నైట్ ఓట్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఓవర్ నైట్ ఓట్స్ లో విటమిన్లు, మినరల్స్ తో పాటు బీటా-గ్లూకాన్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కోలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎక్కువ ఫైబర్ కారణంగా ఇది పొట్ట నిండిన అనుభూతిని కలిగిస్తుంది, తద్వారా అతిగా తినడం తగ్గిస్తారు. ఫలితంగా శరీర బరువు నియంత్రణలోకి వస్తుంది. ఓవర్ నైట్ ఓట్స్ లోని ప్రోటీన్ కంటెంట్ కండరాలను బలోపేతం చేయడంలో తోడ్పడుతుంది. ఓట్స్ మరియు నట్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా మారుస్తాయి. బ్రేక్‌ఫాస్ట్ లో ఓవర్ నైట్ ఓట్స్ ను తీసుకోవడం వల్ల ఎముకల దృఢత్వానికి అవసరమయ్యే కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలను కూడా పొందుతారు