బీఈ, బీటెక్ పాసైన వారికి సూపర్ ఆఫర్.. “ఈసీఐఎల్” హైదరాబాద్‌లో ఉద్యోగాలు

లక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) నిరుద్యోగ యువతకు శుభవార్త ప్రకటించింది. సంస్థలోని హైదరాబాద్‌లోని అటామిక్ ఎనర్జీ విభాగంలో పలు ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.


బీఈ, బీటెక్ పాసైన వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వారికి మంచి వేతనంతో పాటు ప్రభుత్వరంగ సంస్థలో పనిచేసే ఛాన్స్ కూడా లభించనుంది. అర్హత కలిగినవారు వెంటనే దరఖాస్తు చేసుకోవడం మంచిది.

మొత్తం ఖాళీలు..

160

ఖాళీల వివరాలు..

ఈసీఐఎల్ సంస్థలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్ (C) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలు హైదరాబాద్‌లో ఉండటమే కాకుండా, భవిష్యత్తులో ఇతర ప్రాజెక్ట్ లొకేషన్లలో కూడా పనివకాశాలు లభించే అవకాశం ఉంది.

అర్హతలు..

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో బీఈ లేదా బీటెక్ పాసై ఉండాలి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్ వంటి విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. అలానే సంబంధిత రంగంలో పని అనుభవం (వర్క్ ఎక్స్‌పీరియన్స్) ఉంటే అదనపు ప్రయోజనంగా పరిగణిస్తారు. ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని స్పష్టంగా పేర్కొన్నారు.

జీతం..

ఈసీఐఎల్‌లో ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతనం ఇవ్వనున్నారు.

మొదటి సంవత్సరం: రూ.25,000 నెల జీతం

రెండో సంవత్సరం: రూ.28,000 నెల జీతం

మూడో, నాలుగో సంవత్సరాలు: రూ.31,000 నెల జీతం

అంతేకాకుండా కంపెనీ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు, ప్రయాణ సౌకర్యాలు, మెడికల్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.

వయస్సు పరిమితి..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు మాత్రమే. అయితే ప్రభుత్వ నియమాల ప్రకారం SC, ST, OBC, PWD అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం..

అభ్యర్థులను క్రింది ప్రమాణాల ఆధారంగా ఎంపిక చేస్తారు:

విద్యార్హతలు

పని అనుభవం

ఇంటర్వ్యూ (డైరెక్ట్ పర్సనల్ ఇంటరాక్షన్)

ప్రతిభాపరంగా తుది ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు ప్రక్రియ..

అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియలో సర్టిఫికెట్లు, ఫోటో, సంతకం, విద్యా వివరాలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు సంబంధించిన సమాచారం నోటిఫికేషన్‌లో ఇవ్వబడింది.

దరఖాస్తు గడువు..

చివరి తేదీ: 2025 సెప్టెంబర్ 22

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.