ఈ ఏడాది జూన్ నాటికి విద్యాశాఖలో సంస్కరణలు పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అధికారులను ఆదేశించారు. వచ్చే నాలుగేళ్లు పూర్తిగా విద్యా ప్రమాణాలను మెరుగుపర్చడంపైనే దృష్టి పెట్టాలని సూచించారు. ఆగస్టులో జరగనున్న విద్యాశాఖ మంత్రుల కాంక్లేవ్‌కు విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు. మే నెలాఖరుకు పూర్తిస్థాయి వివరాలతో డ్యాష్ బోర్డు సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. మెగా డీఎస్సీపైనా లోకేష్ సమీక్షించారు. ఆంధ్ర యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. ప్రపంచంలోనే టాప్-100 వర్సిటీల జాబితాలో ఏయూ నిలిచేలా లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు.
Also Read
Education
More