మీ బ్యాంకు అకౌంట్‌కు ఇక నుండి నలుగురు నామినీలు, నవంబర్ 1 నుండే అమల్లోకి…

బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్…కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, బ్యాంక్ అకౌంట్ నామినీల విషయంలో కీలక మార్పులను ప్రకటించింది. ఇకపై నలుగురు నామినీలను ఎంచుకునే అవకాశాన్ని కల్పించింది.


నవంబర్ 1 నుండి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

బ్యాంకు అకౌంట్‌కు నలుగురు నామినీలు
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, బ్యాంక్ అకౌంట్ నామినీల విషయంలో కీలక ప్రకటన చేసింది. ఇక నుండి నలుగురు నామినీలను ఎంచుకునే వీలు కల్పించింది. బ్యాంకింగ్ సిస్టమ్‌లో క్లెయిమ్ సెటిల్‌మెంట్ మరింత సులభతరం చేసేందుకు, సమర్థవంతంగా నిర్వహించడానికి ఈ నిబంధనలు మార్చారు. ఈ మేరకు బ్యాంకింగ్ చట్టాలు (అమెండ్‌మెంట్) యాక్ట్, 2025లో కేంద్రం మార్పులు చేసింది.

నవంబర్ 1 నుండే అమలు
బ్యాంక్ అకౌంట్ నామినీలకు సంబంధించి బ్యాంకింగ్‌ చట్టంలో తెచ్చిన సవరణలు నవంబరు 1 నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. బ్యాంకింగ్‌ సవరణ చట్టం 2025ను ఏప్రిల్‌ 15నే నోటిఫై చేశారు. బ్యాంకింగ్ చట్టాల్లో పారదర్శకత కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం- 1934, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం- 1949, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం- 1955, బ్యాంకింగ్ కంపెనీల (సముపార్జన, బదిలీ అండర్‌టేకింగ్స్) చట్టం- 1970 ఇలా దాదాపు 19 సవరణలు చేసింది కేంద్రం ప్రభుత్వం.

బ్యాంకు అకౌంట్‌కు నామినీల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ చేసిన సవరణల ప్రకారం, నలుగురు నామినీలను ఒకే సారి లేదా ఒకరి తర్వాత ఒకరిని పెట్టుకోవచ్చు. డిపాజిటర్ల ఇష్టం మేరకు నామినీలను ఎంచుకోవచ్చు. క్లెయిమ్ సెటిల్‌మెంట్ విషయంలో ఎవరికి ఎంత వాటా అనే విషయం కూడా వారి ఇష్టం మేరకే ఎంచుకోవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.