మచ్చలు లేని, నలుపు లేని చర్మం కావాలని అందరూ అనుకుంటారు. చర్మం నలుపుగా ఉన్నా.. మచ్చలు లేకుండా కనిపిస్తే.. చాలు అనుకుంటారు. చాలా మంది మెడ నలుపుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖం అంతా ఒక రంగులో ఉంటే.. మెడ దగ్గర మాత్రం నలుపుగా ఉంటుంది. దీంతో బయటకు ఎక్కడికి వెళ్లాలన్నా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కానీ ఇది మీరు చేసే నిర్లక్ష్యం కారణంగానే వస్తుంది. ఎందుకంటే చాలా మంది కేవలం ముఖాన్ని మాత్రమే శుభ్రం చేస్తూ ఉంటారు. మెడను అస్సలు పట్టించుకోరు. ఎలాంటి క్రీమ్స్ చేసుకున్నా.. ప్యాక్స్ అయినా కేవలం ముఖానికి మాత్రమే వేసుకుంటారు. మెడను అస్సలు పట్టించుకోరు. దీని వల్ల మెడపై మురికి పేరుకు పోయి.. పిగ్మెంటేషన్ లేదా నలుపుగా మారిపోతుంది. ఈ మెడ నలుపును వదిలించుకునేందుకు ఇంట్లోనే కొన్ని చిట్కాలు ట్రై చేస్తే సరి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.
శనగ పిండి:
మెడ నలుపుతో బాధ పడేవారు.. శనగ పిండిని ఉపయోగించవచ్చు. నలుపును పోగొట్టడంలో శనగ పిండి చక్కగా పని చేస్తుంది. నలుపును క్రమేపీ తగ్గించి.. మెరుపును తీసుకొస్తుంది. ఒక గిన్నెలోకి ఒక స్పూన్ శనగ పిండి తీసుకోండి. ఇందులోకి కొద్దిగా నిమ్మరసం, నీళ్లు కలిపి పేస్టులా సిద్ధం చేసుకోండి. ఈ మిశ్రమంతో మెడపై రుద్దుతూ ఉంటే నలుపు తగ్గుతుంది. ఇలా వారంలో రెండు సార్లు చేయండి.
పెరుగు:
పెరుగుతో ఆరోగ్యమే కాకుండా.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు. చర్మానికి, జుట్టుకు కూడా పెరుగును ఉపయోగించవచ్చు. నలుపును తొలగించే గుణాలు పెరుగులో ఉన్నాయి. మెడపై నలుపును వదిలించుకునేందుకు ఒక గిన్నెలో.. కొద్దిగా పెరుగు, పసుపు తీసుకుని కలిపి.. మెడకు పట్టించండి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే నలుపు తగ్గుతుంది.
తేనె:
తేనెతో కూడా నలుపును తగ్గించుకోవచ్చు. నలుపును తగ్గించే గుణాలు తేనెలో కూడా ఉన్నాయి. కాబట్టి మెడ నలుపు కూడా తగ్గుతుంది. ఒక చిన్న గిన్నెలోకి కొద్దిగా తేనె, నిమ్మరసం తీసుకుని కలపండి. ఈ మిశ్రమాన్ని మెడకు బాగా పట్టించి రుద్దండి. ఆరిపోయాక కడిగేయండి. ఇలా తరచూ చేస్తూ ఉంటే మెడ నలుపు తగ్గుతుంది.