Electricity Bill: కరెంట్ బిల్ కోసం మారిన రూల్స్.. ఆన్లైన్లో ఎలా కట్టాలో తెలుసుకోండి.!

Electricity Bill: ఇప్పటివరకు గూగుల్ పే, ఫోన్ పే మరియు పేటీఎం వంటి UPI యాప్స్ ద్వారా పెమెంట్స్ చెల్లించే అవకాశం ఉండేది. అయితే, కొత్తగా RBI నిర్ధేశించిన రూల్స్ ప్రకారం, UPI ద్వారా నేరుగా కరెంట్ బిల్లులు చెల్లించే అవకాశం ఉండదు.


అంటే, ఇక నుండి గూగుల్ పే, ఫోన్ పే మరియు పేటీఎం వంటి UPI యాప్స్ ద్వారా మీ కరెంట్ బిల్లులు చెల్లించలేరు. దీనికి కొత్త మార్గదర్శకాలు మరియు మార్గాలు అందించింది. అయితే, ఆన్లైన్ లోనే చాలా ఈజీగా మీ కరెంట్ బిల్లు చెల్లించాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకోండి.

ఆన్లైన్ లో Electricity Bill ఎలా కట్టాలి?

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. ఈ కొత్త రూల్స్ ప్రకారం ఆన్లైన్ లో కరెంట్ బిల్లులు కట్టడానికి UPI యాప్స్ కు బదులుగా helpdesk ను ఉపయోగిస్తుంది. దీనికోసం, తెలంగాణ రాష్ట్ర కరెంట్ వినియోగదారులు TGSPDCL యాప్ లేదా అధికారిక సైట్ https://tgsouthernpower.org ద్వారా నేరుగా బిల్స్ ను పే చేయవచ్చు. ఈ సైట్ నుండి లేదా యాప్ నుంచి యూనిక్ సర్వీస్ నెంబర్ ను ఎంటర్ చేసి కరెంట్ బిల్ ను పే చేయవచ్చు.

 Electricity Billఇక ఆంధ్రప్రదేశ్ కరెంట్ వినియోగదారుల విషయానికి వస్తే, APCPDCL యాప్ లేదా www.apcpdcl.in వెబ్సైట్ ద్వారా కరెంట్ బిల్లు ను పే చేయవచ్చు. దీనికోసం, సైట్ లేదా యాప్ లో పే యువర్ బిల్ ఆప్షన్ ను ఎంచుకొని మీ యూనిక్ సర్వీస్ నెంబర్ ను ఎంటర్ చేసి బిల్ ను పే చెయ్యాలి. అయితే, వెబ్సైట్ నుండి పే చేయాలంటే Billdesk ఆప్షన్ ఎంచుకోండి మరియు ఇందులో మీ యూనిక్ సర్వీస్ నెంబర్ మరియు క్యాప్చా ఎంటర్ చేయగానే మీ బిల్ వివరాలు వస్తాయి. పేమెంట్ కోసం క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, వాలెట్ మరియు UPI యాప్ ద్వారా కూడా అమౌంట్ ను పే చేయవచ్చు.

 Electricity Billజూలై 1 వ తేదీ నుండి ఈ కొత్త నియమాలు అమలులోకి వచ్చాయి. కాబట్టి, ఇక నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో కరెంట్ బిల్లు కట్టడానికి ఇదే పద్ధతి ఫాలో అవ్వాల్సి ఉంటుంది.