ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఒకటో తేదీనే జీతాలు, పెన్షన్లు జమ చేయడంపై పలు సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
ఈనాడు, అమరావతి: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఒకటో తేదీనే జీతాలు, పెన్షన్లు జమ చేయడంపై పలు సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, పెన్షనర్లు సంతోషంగా ఉన్నారని.. గత రెండు నెలలుగా జీతాలు, పెన్షన్లు ఒకటో తేదీనే జమవుతున్నాయని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, శ్రీరామశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. గత జగన్ ప్రభుత్వంలో జీతాలు సక్రమంగా రాక నెలవారీ అద్దెలు, రుణ వాయిదాలు కట్టలేక ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. కొత్త డీఏతో కలిపి పెన్షన్ రావడం శుభపరిణామమని హైదరాబాద్‌లో స్థిరపడిన ఏపీ పెన్షన్‌దారుల సంఘం ప్రధాన కార్యదర్శి బుచ్చిరాజు పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియని దుస్థితి ఉండేదని, ఈ సమస్యపై జగన్‌కు ఎన్ని పర్యాయాలు మొర పెట్టుకున్నా.. వృద్ధులను నిర్లక్ష్యం చేశారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుబ్బరాయన్, పెద్దన్నగౌడ్‌లు తెలిపారు.
Beta feature