కరువు భత్యం జీవోలపై ఉద్యోగుల కన్నెర్ర

దీపావళి కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కరువు భత్యం(డీఏ)ను ప్రకటించింది.


దీనిపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో హర్హం వ్యక్తమైంది. తీరా విడుదలైన జీవోలు 60, 61ల ను చూసి కన్నెర్ర చేస్తున్నారు. ఇప్పుడు అమలవుతున్న కరువు భత్యం 33.67%కు అదనంగా ఒక్క డీఏ 3.64% ప్రకటించడంతో ప్రస్తుతం కరువుభత్యం 37.31%గా మారనుంది. ఈ డీఏను 2025 అక్టోబరు నుంచి ఇవ్వ నున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. జీవోల ప్రకా రం 1.1.2024 నుంచి 30.9.2025 వరకు రావాల్సిన 21 నెలల డీఏ బకాయిలు బకాయిలను ఉద్యోగి తీసు కోవాలంటే రిటైర్‌ కావాల్సిందే. ఉద్యోగి రిటైర్‌మెంట్‌ రోజున డీఏ బకా యిలు చెల్లిస్తామని జీవోల్లో పేర్కొనడంపై ఆయా సంఘాల నాయకు లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వం డీఏ బకాయిల చెల్లింపులో ఖజానా మీద భారం పడకుండా మధ్యేమార్గం గా ఉద్యోగుల పీఎఫ్‌ ఖాతాల్లో చెల్లించడం రివాజు. గతంలో రెండు, మూడు దఫాలుగానైనా చెల్లించేవారు. దీనికి భిన్నంగా డీఏ బకాయిలన్నీ ఉద్యోగి చనిపో యిన తర్వాత బెని ఫిట్స్‌తోనో, లేదా రిటైర్‌ మెంట్‌ బెనిఫిట్స్‌తోనే ఇస్తామని చెప్పడం దారుణమని ఉద్యోగ వర్గాలు నిరసిస్తున్నాయి. ఒక్కో ఉద్యోగి డీఏ బకాయిల కింద రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకు పొందాల్సి వుంది. జీవో 60, 61 పరిశీలిస్తే సీపీఎస్‌ ఉద్యోగులకు బకాయిల చెల్లిం పు ప్రస్తావనలేదు. రిటైర్‌ అయిన ఉద్యోగులకు 2027-28లో 12 వాయి దాల్లో ఈ బకాయిలు చెల్లిస్తామని చెప్పడాన్ని ఉద్యోగ సంఘాలు నిరసిస్తున్నాయి. నాలుగు డీఏలు ఇవ్వాల్సిన ప్రభుత్వం కేవలం ఒక్క డీఏ ఇచ్చి, అది కూడా చెల్లింపు విషయంలో గందళగోళానికి గురిచేయడాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను మోసం చేయడమేనని సంఘాలు విమర్శిస్తున్నాయి.

జీవోలు 60, 61లను సవరించాలి

ప్రభుత్వం డీఏ బకాయిల చెల్లింపు విషయంలో దాటవేత ధోరణిని ప్రదర్శిస్తోంది. 21 నెలల బకాయిలు రిటైర్‌మెంట్‌ నాడు చెల్లిస్తామని జీవోలో పేర్కొనడం దారుణం. 20 ఏళ్ల తర్వాత రిటైరయ్యే ఉద్యోగికి ఈ బకాయిల సొమ్ముకు వడ్డీ గాని, అవసరాలకు డబ్బును వాడుకొనే అవకాశం ఉండదు. తక్షణం సవరించాలి.

– వి.రవికుమార్‌, యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

రిటైర్‌మెంట్‌తో ఇస్తామనడం సరికాదు

డీఏ బకాయిలు చెల్లింపుల విషయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ అనుసరించిన తీరు బాధాకరం. 21 నెలల డీఏ బకాయిలు రిటైర్‌మెంట్‌తోపాటు ఇస్తామనడం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగలేదు. సీపీఎస్‌ వారి ప్రస్తావన తేకపోవడం దారుణం.

– షేక్‌ రంగావళి, రాష్ట్ర కార్యదర్శి, ఏపీటీఎఫ్‌ ఉపాధ్యాయ సంఘం.

సవరణకు డిమాండ్‌

డీఏ బకాయిలను రిటైరైన తర్వాత చెల్లిస్తామని షరతు పెట్టడాన్ని వ్యతిరేకి స్తున్నామని, ఇప్పటికే ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు 2027-28 ఆర్థిక సంవత్సరంలో బకాయిలను 12 విడతల్లో చెల్లిస్తామని మెలిక పెట్టడాన్ని ఖండి స్తున్నట్టు ఏపీ టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వై.దేముడు తెలిపారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి నాలుగు విడతల డీఏల చెల్లింపు గురించి ఎదురుచూస్తున్న సమయంలో ఒకేఒక్క డీఏను దీపావళి సందర్భంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించి, అదికూడా ఎరియర్స్‌ చెల్లింపు విషయంలో ఉద్యోగి రిటైరైన తర్వాత లేదా మరణించిన తర్వాత చెల్లిస్తామనడం విడ్డూరంగా ఉందని డెమొక్రటిక్‌ పీఆర్టీయూ రాష్ట్ర ప్రఽధానకార్యదర్శి పి.వెంకటేశ్వరరావు ఆక్షేపించారు.

ప్రస్తుత అవసరాలకు ఇవ్వాల్సిన డీఏను రిటైర్మెంట్‌ తర్వాత లేదా మరణానంతరం ఇస్తామనడం అన్యాయ మని ఏపీటీఎఫ్‌-1938 నాయకులు జి.కృష్ణ, రామ్మోహన్‌, మోహన్‌ ఆరోపించారు. కూటమి ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయులకువున్న నమ్మకాన్ని వమ్ముచేస్తూ నాలుగు డీఏలకు కేవలం ఒక డీఏను ప్రకటించి నిరాశకు గురిచేశారని ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామారావు, రెడ్డి దొర ఆరోపించారు.

సంప్రదాయానికి విరుద్దంగా ఉన్న కరువు భత్యం జీవోలు 60, 61 వెంటనే సవరించాలని ఏపీ ప్రైమరీ టీచర్స్‌ అసోసియేషన్‌ (ఆప్టా) జిల్లా అధ్యక్ష, కార్యద ర్శులు సీహెచ్‌.శివరామ్‌, ఎం.శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

డీఏలకు సంబంధించి విడుదల చేసిన 60, 61 జీవోలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి ఇచ్చారా ? లేదా ? అధికారులు స్పష్టం చేయాలని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు, ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలనాయుడు డిమాండ్‌ చేశారు. రెండు జీవోల విడుదలపై సవరణ చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

జీవోల్లో సవరణలకు సంకేతాలు

ఉద్యోగ సంఘాల అభ్యర్థన, డిమాండ్ల మేరకు డీఏ చెల్లింపు జీవో లు 60, 61 మార్గదర్శకాల్లో సవరణలు ఒకటి, రెండు రోజుల్లో చేయనున్నట్టు సంకేతాలు వచ్చాయి. ఆ మేరకు రెగ్యులర్‌, సీపీఎస్‌ ఉద్యోగులతోపాటు పెన్షనర్లకు కలిపి 2027-28 ఆర్థిక సం వత్సరం వరకు నిరీక్షించాల్సిన అవస రం లేకుండా మూడు సమాన వాయి దాల్లో డీఏ బకాయిలు చెల్లించేలా సవరణ జీవోలు విడుదల కానున్నట్టు తెలిసింది. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి వుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.