జీవితంలో ఏదో ఒక సమయంలో వ్యాపారం ప్రారంభించాలని చాలా మంది ఆసక్తితో ఉంటారు. ఇందుకోసం ఎన్నో రకాల మార్గాలను అన్వేషిస్తుంటారు. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు పొందాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు.
అయితే లాభాలు రావనే భయంతోనో, పెట్టుబడి ఎక్కువ అవుతుందన్న కారణంతోనో ఆ ఆలోచనను విరమించుకుంటుంటారు.
కానీ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొంగొత్త మార్గాలను అన్వేషించడం ద్వారా మంచి లాభాలను అందించే వ్యాపారాలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. అలాంటి ఓ బెస్ట్ బిజినెస్ ఐడియాల్లో బాటిల్ రీసైక్లింగ్ ఒకటి. తాగి పడేసిన బీర్ బాటిల్స్‌తో మంచి లాభాలను ఆర్జించవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి వ్యాపారాలను ఏర్పాటు చేసుకుంటే మంచి లాభాలు పొందొచ్చు. ఇంతకీ ఈ బాటిల్ రీసైక్లింగ్ వ్యాపారానికి ఎంత పెట్టుబడి అవసరం ఉంటుంది.? లాభాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఖాళీ బీర్ బాటిల్స్‌ను క్రిస్టల్స్‌గా మార్చి విక్రయిస్తే మంచి లాభాలు ఆర్జించవచ్చు. బాటిల్స్ నుంచి వచ్చే క్రిస్టల్స్‌తో పెద్ద పెద్ద కంపెనీలు గాజు పాత్రలు, సీసలు, గ్లాసులను తయారు చేస్తాయి. అంతేకాకుండా కొన్ని కంపెనీలు నిర్మాణం రంగంలో కూడా వీటిని ఉపయోగిస్తంటారు. కాబట్టి వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇక ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే గ్లాస్ బాటిల్ పౌడరింగ్ మిషన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వీటి ధర మార్కెట్లో రూ. 50 వేల నుంచి రూ. రెండున్న లక్షల వరకు ఉంటాయి. స్థానికంగా ఉండే స్క్రాప్ పాయింట్స్ నుంచి లేదా నేరుగా వైన్స్, బార్ల వద్ద నుంచి కూడా కొనుగోలు చేసుకోవచ్చు. బాటిల్స్‌ను సేకరించిన తర్వాత వాటిని మిషిన్స్‌లో వేస్తే చాలు క్రిస్టల్ రూపంలో వస్తాయి. వీటిని కిలోల చొప్పున విక్రయించొచ్చు.
లాభాల విషయానికొస్తే ఇక టన్ను గ్లాస్ క్రిస్టల్స్ విక్రయిస్తే రూ. 8000 వస్తుంది. ఇందుకు మనకు అయ్యే ఖర్చు సరాసరి రూ. 3000 అవుతుంది. అంటే ఒక టన్ను గ్లాస్ క్రిస్టల్స్ అమ్మితే రూ. 5000 లాభం వస్తుంది. నెలలో తక్కువలో తక్కువ 10 టన్నుల క్రిస్టల్ అమ్మగలిగినా రూ. 50 వేల లాభ ఏటూ పోదు.