UDID number: సదరం సర్టిఫికెట్ విధానానికి స్వస్తి.. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు

ప్రతి దివ్యాంగులకు యూడిఐడి (UDID) నెంబర్ జనరెట్ చేయాలని పంచాయతీరాజ్ కార్యదర్శి దివ్య దేవరాజన్ జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు.


ఇవాళ జిల్లా కలెక్టర్లతో దివ్యదేవరాజన్ (Divya Devarajan) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యూనిక్ డిసేబులిటీ ఐడి జారీ, సోలార్ పవర్ ప్లాంట్ లపై సమీక్ష నిర్వహించారు. ఆయా జిల్లా కలెక్టర్లు పాల్గొన్న ఈ సమీక్షలో దివ్య దేవరాజన్ మాట్లాడుతూ.. సదరం సర్టిఫికెట్ (Sadaram Certificate) ఉన్న ప్రతి దివ్యాంగులకు డిఆర్ డిఓలు యూడిఐడి జనరెట్ చేయాలన్నారు. మార్చి 1 నుంచి సదరం సర్టిఫికెట్ విధానానికి స్వస్తి పలికి వాటి స్థానంలో మీ సేవా కేంద్రాల ద్వారా నూతనంగా యూడిఐడి కార్డుల జారీ చేయాలన్నారు.

యూడిఐడి కార్డుల దివ్యాంగులకు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉపయోగపడుతాయని చెప్పారు. సోలార్ విద్యుత్ ప్లాంట్ల డీపీఆర్ లను తయారు చేయాలన్నారు. కాగా దివ్యాంగుల కోసం ఒక జాతీయ డేటాబేస్ ను రూపొందించడం ఈ యూడీఐడీ ప్రాజెక్టు లక్ష్యం. దీని వల్ల దేశంలోని వికలాంగుల పూర్తి వివరాలు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంటాయి. ఈ స్కీమ్ కింద వైకల్యం ఉన్న వ్యక్తులకు యూనివర్సల్ ఐడీ, వైకల్యం సర్టిఫికేట్ లను అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.