రేషన్‌ కార్డులోని కొత్త సభ్యులకు కూడా..

ఆహారభద్రత కార్డులోని సభ్యులందరికీ ఈ కేవైసీ తప్పనిసరి చేసిన పౌర సరఫరాల శాఖ తాజాగా కొత్త సభ్యులపై దృష్టి సారించింది.


కొత్త రేషన్‌కార్డుల మంజూరు, పాత కార్డులో కొత్తసభ్యుల ఆమోదం ప్రక్రియ కొనసాగుతున్నందున కొత్త సభ్యులు సైతం ఈ కేవైసీ చేసుకోవాలని ఆదేశించింది. రేషన్‌కార్డులో పేర్లున్న కుటుంబ సభ్యులందరూ దగ్గరలోని రేషన్‌ దుకాణానికి వెళ్లి ఈ-పాస్‌ యంత్రంలో బయోమెట్రిక్‌ వేలిముద్రలు అప్‌డేట్‌ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చౌకధరల దుకాణాల డీలర్లు సైతం రేషన్‌ కోటా డ్రా కోసం వస్తున్న లబ్ధిదారులకు ఈ కేవైసీ(e-KYC) గురించి గుర్తు చేస్తున్నారు.

వాస్తవంగా గత రెండేళ్లగా ఈ-కేవైసీ నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికీ పలు మార్లు గడువు పెంచుకుంటూ వస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఇప్పటికే డుబ్లికేట్, చనిపోయిన యూనిట్లు ఎరివేతకు గురికాగా, మిగిలిన వాటిలో దాదాపు 85 శాతం ఈ-కేవైసీ పూర్తయింది. ఈ నెల 20లోగా ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోకుంటే సదరు యూనిట్ల రేషన్‌ కోటా నిలిపివేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఆధార్‌కు ఈ-పాస్‌ యంత్రానికి అనుసంధానం చేయడంతో బినామీ పేర్ల మీద బియ్యం (Rice) తీసుకోకుండా అడ్డుకట్ట వేయడం సులభం అవుతుంది. దీనితో చౌకధరల దుకాణాల్లో బియ్యం పంపిణీ మరింత సమర్ధవంతంగా అమలు చేయవచ్చనే ఉద్దేశంతో ఈ-కేవైసీ నిబంధన తప్పనిసరి చేసినట్లు కనిపిస్తోంది.

అప్‌డేట్‌ లేక తిప్పలు
ఆధార్‌ నవీకరణ(అప్‌డేట్‌) లేక బయోమెట్రిక్‌ వల్ల కొందరికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజలు ఆధార్‌ కేంద్రాలకు వెళ్లి అప్‌డేట్‌ ప్రక్రియ పూర్తి చేయించుకున్నప్పటికీ ఈ-కేవైసీ ప్రక్రియలో వేలిముద్రలు రావడం లేదు. ఆధార్‌ అప్‌డేట్‌ పూర్తి కాకపోవడంతో ఈ-కేవైసీ తీసుకోవడంలేదని వారు పేర్కొంటున్నారు. దీంతో లబ్ధిదారులు ఆధార్‌ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఆధార్‌ (Aadhaar) నవీకరణ పూర్తి కాకపోవడంతో చిన్నారులు ఈ-కేవైసీ ప్రక్రియకు దూరమవుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.