గత వారం రోజులుగా సినీ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం. తనతో పదేళ్లు సహజీవనం చేసి ఇప్పుడు ఓ హారోయిన్ మోజులో పడ్డాడని రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి ఈ కేసుల్లో కొత్త కొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలనే బుధవారం నార్సింగ్ పోలీసులను సంప్రదించిన లావణ్య.. రాజ్ తరుణ్ తనను నమ్మించి మోసం చేశాడని, తనకు అబార్షన్ కూడా చేయించాడని.. దాని బిల్లు రాజ్ తరుణ్ చెల్లించాడని ఆరోపిస్తూ పూర్తి ఆధారాలు పోలీసులకు అందించింది. తాజాగా రాజ్ తరుణ్,లావణ్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
రాజ్ తరుణ్,లావణ్య కేసులో రోజుకో కొత్త ట్విస్టు వెలుగు చూస్తుంది. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. రాజ్ తరుణ్ తో తనకు పదేళ్ల క్రితం వైజాగ్ లో పరిచయం ఏర్పడిందని.. ఆ పరిచయం ప్రేమకు దారి తీసిందని లావణ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. పదేళ్లుగా తాము కాపురం చేస్తున్నామని.. కొన్నాళ్ల క్రితం రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని ఫిర్యాదులో పేర్కొంది లావణ్య. ఇందుకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్ ని కూడా పోలీసులకు అందించింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఈ మధ్య మాల్వీ మల్హోత్రా అనే నటితో ఎఫైర్ పెట్టుకున్నాడని.. ఈ కారణంతోనే తనకు దూరంగా వెళ్లిపోయాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలోనే బుధవారం రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారు. గురువారం మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం ముగ్గురిపై 420, 493, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే ఏ1 గా రాజ్ తరుణ్, ఏ2 గా మాల్వీ మల్హోత్రా, ఎ3 గా మయాంక్ మల్హోత్రాను పోలీసులు చేర్చారు.
బుధవారం పోలీసులకు లావణ్య ఇచ్చిన ఆధారల ప్రకారం.. 2008 సంవత్సరం నుంచి లావణ్యతో రాజ్ తరుణ కు పరిచయం, 2010 లో ప్రమోజల్, 2014 నుంచి కలిసి ఉంటున్నట్లు లావణ్య చెబుతుంది. ఈ క్రమంలోనే రాజ్ తరుణ్ కుటుంబానికి రూ.70 లక్షలు ఇచ్చామని.. 2016 లో తాను గర్భవతి అయితే.. రెండో నెలకు సర్జరీ చేయించి అబార్షన్ చేయించాడు. హాస్పిటల్ బిల్లు కూడా రాజ్ తరుణ్ కట్టాడని తన ఫిర్యాదులో పేర్కొంది. కావాలనే తనను మాల్వీ, రాజ్ తరుణ్ డ్రగ్స్ కేసులో ఇరికించారని వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదులో తెలిపింది. అందే కాదు కొన్నిరోజులుగా మాల్వీ ఆమె సోదరుడు మయాంక్ మల్హోత్రా తనను చంపుతానని బెదిరిస్తున్నట్లు.. ఈ ముగ్గురిపై పోలీసులు చర్యలు తీసుకోవాల్సిందిగా లావణ్య ఫిర్యాదులో పేర్కొంది.