ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఈ వారం షోలో సింగిల్స్ పేరుతో ఒక ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యింది. ఇందులో ఎలాంటి క్వాలిటీస్ ఉన్న బెటర్ హాఫ్ కావాలో చెప్పారు.
ఇక శ్రీముఖి ఐతే కావ్య తలకి ఒక కిరీటం పెట్టి “నీకు నిఖిల్ కాకుండా ఎలాంటి క్వాలిటీస్ ఉన్న హజ్బెండ్ కావాలో కనుక్కుందాం రా” అని ఒక కుర్చీలో కూర్చోబెట్టింది. “అసలు సింగల్ గా ఇలాగే ఉండిపోవాలనిపిస్తోంది” అంటూ నిరాశగా చెప్పింది కావ్య .”ఇంత అందం వేస్ట్ అయిపోకూడదు” అంది శ్రీముఖి. “మీరు సింగల్ గా ఉండిపోతే మాలాంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలి తెలుసా” అన్నాడు హరి. ఇంతకు నీకు నీ భర్తలో కావాల్సిన క్వాలిటీస్ ఏంటి అని శ్రీముఖి అడిగింది.
“నాకంటే హైట్ గా ఉండాలి. మంచి డ్రెస్ సెన్స్ ఉండాలి. ఇంకో క్వాలిటీ అతనికి వంట చేయడం రావాలి. ప్రతీ రోజూ అతను వంట చేసి నాకు ఫుడ్ పంపించాలి..
పని చేస్తూ వంట చేస్తాను అన్నా ఓకే లేదంటే వంటే చేసుకుంటాను అన్నా ఓకే” అని చెప్పింది కావ్య. “ఇక మూడో క్వాలిటీ లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుని కాకుండా స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా మాట్లాడేవాళ్ళు కావాలి. లాస్ట్ క్వాలిటీ అని కాదు కానీ ఆ ఒక్కళ్ళు తప్ప ఎవ్వరైనా ఓకే చెప్తాను” అని చెప్పింది కావ్య. ఇక శ్రీముఖి వచ్చి “నిఖిల్ నువ్వు బాగున్నావ్ కానీ నీ పేరు బాలేదు అందుకే కావ్య తరపున నేనే రిజెక్ట్ చేస్తున్నా” అని చెప్పింది.
కావ్య నీకు ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి రావాలని కోరుకుంటున్నా అని చెప్పింది. నిఖిల్, కావ్య విడిపోయి చాలా రోజులయ్యింది. బిగ్ బాస్ కి వెళ్లేముందు ఈ ఇద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి ఏ షోలో ఐనా కానీ ఒకరు ఉంటే ఇంకొకరు రారు. ఇక ఇప్పుడు సింగిల్స్ ఎపిసోడ్ కి కావ్య వచ్చింది.
































