వైసీపీ చెప్పేవన్నీ అబద్ధాలే.. విశాఖ స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

www.mannamweb.com


ఉత్తరాంధ్ర ప్రజలు భారీ ఎన్డీయే కూటమిని మెజారిటీతో గెలిపించారన్నారు సీఎం చంద్రబాబు. రాజకీయాల్లో విర్రవీగిన వారికి ప్రజలు తగిన శిక్ష వేశారని చురకలు అంటించారు. రాష్ట్రం నిలదొక్కుకోవడానికి తమ బాధ్యత తాము నిర్వహిస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్‎లో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి ఉత్తరాంధ్రలో పర్యటించారు సీఎం చంద్రబాబు. పోలవరం ఎడమకాలువ పనులను పరిశీలించడంతో పాటూ భోగాపురం ఎయిర్ పోర్టు పనులపై ఆధికారులను అడిగి తెలుసుకోనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా అభివృద్ధికి సహకరించాలని కోరారు. విశాఖ స్టీల్స్ ప్రైవేటీకరణను తాను ఒప్పుకున్నామని చెబుతున్నారు.. అవన్నీ అబద్దాలని అన్నారు సీఎం చంద్రబాబు. గతంలో వాజపేయి హయాంలోనే ప్రైవేటీకరణ చేస్తాన్నప్పుడు అడ్డుకున్నామని స్పష్టం చేశారు. ఈ సారి విశాఖ ప్రైవేటీకరణ జరగకుండా కాపడుతామన్నారు.

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు 5 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాయో ఇప్పుడు అలానే ఉన్నాయని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పనులు జరగలేదని చంద్రబాబు విమర్శించారు. టీడీపీ హాయాంలో పోలవరం పనులు 72 శాతం పూర్తి చేస్తే.. జగన్ ప్రభుత్వం డయాఫ్రమ్‌ వాల్‌ని గోదావరిలో కలిపేసిందని ఆరోపించారు. జగన్ ప్రభుత్వ వైఫల్యంతోనే పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్‌ వాల్, కాపర్ డ్యామ్స్‌ దెబ్బతిన్నాయని విమర్శించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు పూర్తి కావడానికి సమయం పడుతుందని.. అనకాపల్లి ప్రాంత రైతుల కోసం పురుషోత్తపట్నం లిఫ్ట్ పనులను వేగంగా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. వెంటనే నిధులు విడుదల చేసి పనులు పూర్తి చేయాలని అధికారులను అక్కడికక్కడే ఆదేశించారు.