జుట్టు విపరీతంగా రాలిపోతుందా? ఉల్లినూనెతో చెక్‌ పెట్టొచ్చు.. ఎలాగంటే

www.mannamweb.com


నేటి కాలంలో చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. అకారణంగా జుట్టు జుట్టురాలిపోతే ఆ బాధ వర్ణనాతీతం. ఈ నేపథ్యంలో జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై దృష్టి సారించడం చాలా ముఖ్యం.

మీరు ప్రతిరోజూ ఉపయోగించే కొబ్బరి నూనెతో జుట్టు ఆరోగ్యం కాపాడుకోవచ్చు.

అందుకు తొలుత ఉల్లిపాయ నూనెను తయారు చేసుకోవాలి. ఈ నూనెను తలకు పట్టించడం వల్ల పల్చటి జుట్టు ఒత్తుగా మారుతుంది. ఉల్లిపాయ నూనెను ఎలా తయారు చేయాలంటే.. ఉల్లిపాయ నూనెను తయారు చేయడానికి, 200 గ్రాముల కొబ్బరి నూనె లేదా ఆవాల నూనె తీసుకోవాలి. ఆ తరువాత ఒక పాన్ లో నూనె వేడి చేసి, అందులో 1 పెద్ద సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఒక కప్పు కరివేపాకు వేయాలి.

ఉల్లిపాయలు వేయించిన తర్వాత మెత్తగా రుబ్బుకుని మళ్లీ అదే నూనెలో వేసి కొద్దిగా వేడి చేసి చల్లారనివ్వాలి. ఆ తర్వాత దానిని ఓ శుభ్రమైన గుడ్డలో వేసి నూనెను పిండుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఉల్లిపాయ నూనెను జుట్టుకు పట్టించి, ఓ గంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు రాలే సమస్య క్రమంగా తగ్గుతుంది.

ఉల్లిపాయ నూనెను అప్లై చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు రాలిపోయే సమస్యతో బాధపడేవారు ఉల్లిపాయ నూనెను రాసుకోవచ్చు. ఇది మెరుగైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

ఉల్లిపాయ నూనె సహజ కండిషనర్‌గా పనిచేస్తుంది. అలాగే ఉల్లిపాయ నూనె తెల్ల జుట్టు సమస్యను తగ్గించడానికి, తలపై బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను నయం చేయడానికి సహాయపడుతుంది.