డ్వాక్రా మహిళలకు ఎగిరి గంతేసే వార్త.. అకౌంట్లోకి డబ్బులు.. తిరిగి కట్టాల్సిన పని లేదు..

హిళలకు ఆర్థికంగా చేయూత అందించేందుకు ప్రభుత్వాలు స్వయం సహాయక సంఘాలు, డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వీటి ద్వారా మహిళలకు తక్కువ వడ్డీకే రుణ సదుపాయాలతో పాటుగా వారి పిల్లల చదువులకు కూడా ఆర్థికంగా సహకారం అందిస్తూ అండగా ఉంటున్నాయి.


ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం డ్వాక్రా సంఘాల మహిళలకు శుభవార్త వినిపించింది. డ్వాక్రా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ కింద నిధులు మంజూరు చేసింది. గత కొంతకాలంగా రివాల్వింగ్ ఫండ్ విధానం సరిగా అమలు కాలేదు. అయితే మహిళలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం రివాల్వింగ్ ఫండ్ విధానాన్ని పునరుద్ధరించింది.

ఇందులో భాగంగా కొత్తగా ఏర్పాటైన డ్వాక్రా సంఘాలకు కొంత నగదు అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటైన సుమారు 2 వేల డ్వాక్రా సంఘాలకు మూడు కోట్ల రూపాయల రివాల్వింగ్ ఫండ్ నిధులను ఏపీ ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో సంఘానికి రూ.15000 కింద ఈ రివాల్వింగ్ ఫండ్ అందించనున్నారు. అయితే ఇందుకోసం కూడా ప్రభుత్వం ఓ టైమ్ లైన్ విధించింది. 2024 ఆగస్ట్ 2 నుంచి 2025 నవంబర్ 30 మధ్యలో కొత్తగా ఏర్పాటైన డ్వాక్రా సంఘాలకు మాత్రమే ఈ రివాల్వింగ్ ఫండ్ అందిస్తున్నారు.

మరోవైపు ఈ రివాల్వింగ్ ఫండ్‌తో డ్వాక్రా సంఘం నిధి పెరుగుతుంది. దీంతో బ్యాంకులు ఈ సంఘాలకు ఎక్కువ మొత్తంలో రుణం మంజూరు చేసేందుకు అవకాశం ఉంది. అలాగే రివాల్వింగ్ ఫండ్ వలన ఇంకో ప్రయోజనం ఏమిటంటే డ్వాక్రా మహిళలు ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికి అదనంగా పొదుపు చేసుకోవచ్చు. దీంతో ఎక్కువ మొత్తంలో బ్యాంక్ నుంచి రుణాలు పొందేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు.

మరోవైపు డ్వాక్రా సంఘాల కోసం ప్రభుత్వం అనేక కొత్త కార్యక్రమాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. స్త్రీ నిధి, విద్యాలక్ష్మి పేరుతో రుణాలు మంజూరు చేస్తున్న ప్రభుత్వం.. వాయిదాల చెల్లింపులలో ఇబ్బందులు రాకుండా పారదర్శకత కోసం మన డబ్బులు – మన లెక్కలు యాప్ కూడా తెచ్చిన సంగతి తెలిసిందే.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.