మరి కొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు. పార్టీల్లో వణుకు

మరికొద్ది గంటల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏడో దశ లోక్‌సభ పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. సరిగ్గా సాయంత్రం 6.30 గంటలకు వివిధ సంస్థలు నిర్వహించిన సర్వే ఫలితాలు వెల్లడికానున్నాయి.


దేశంలో లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈరోజు సాయంత్రం చివరి దశ పోలింగ్ ముగియనుంది. ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. ప్రతి కంపెనీ ఎగ్జిట్ పోల్ దాదాపు ఒకేరకం గా ఉన్నా కొన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ మాత్రమే ఫలితాలకు దగ్గరగా ఉన్నాయి. ప్రజలు ఉత్కంఠతకు గురవుతున్నారు మరియు ఏ సంస్థ కూడా ఈ పార్టీ గెలవబోతుంది అని చెప్పటం లేదు క్లియర్ గ . సీట్ల విషయంలో చాలా తేడా వస్తుంది.

చివరి వరకు నిషేధం

ఓటర్లపై ప్రభావం చూపకుండా ఉండేందుకు లోక్‌సభ ఏడో దశ పోలింగ్ వరకు ఎగ్జిట్ పోల్స్‌పై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. లేదంటే మిగతా రాష్ట్రాలపైనా ప్రభావం ఉంటుందని ఈసీ చెబుతోంది. లోక్ సభ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 11 గంటల వరకు ట్రెండ్‌ ఎలా ఉంటుందో తెలుస్తుంది.

తప్పిన ఎగ్జిట్ పోల్ అంచనా

ఎగ్జిట్ పోల్స్ కొన్నిసార్లు తప్పు. కొన్ని సందర్భాల్లో ఇది సరైనది. 1998, 2012, 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నిజమయ్యాయి.

2021లో కేరళలో ఎల్‌డీఎఫ్‌, బెంగాల్‌లో టీఎంసీ అధికారంలోకి వస్తాయని సర్వే సంస్థలు జోస్యం చెప్పగా.. 2023లో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందన్న అంచనాలు నిజమయ్యాయి.

కొన్ని సందర్భాల్లో అంచనాలు తప్పాయి. 2004లో ఎన్డీయే అధికారం చేపడుతుందని అంచనా వేసాయి.ఎన్డీయే 181 సీట్లకే పరిమితమైంది. యూపీఏ మెజారిటీ సీట్లు గెలుచుకుని అధికారాన్ని చేజిక్కించుకుంది.