యుబారి కింగ్ మెలోన్: యుబారి కింగ్ మెలోన్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండు. అత్యంత ఖరీదైన పండు జపనీస్ ద్వీపం హక్కైడో ద్వీపంలో ఉన్న యుబారి నగరంలో మాత్రమే సాగు చేస్తారు.
ధనవంతులు తమ సంపదను చూపించడానికి ఈ పండ్లను కొనుగోలు చేస్తారు. 2019లో యుబారి కింగ్ మెలోన్ జత $46,500 (రూ. 39 లక్షలు)కి విక్రయించబడింది. అంటే ఒక్క పండు ధర రూ.19.5 లక్షలు.
రూబీ రోమన్ ద్రాక్ష: రూబీ రోమన్ ద్రాక్ష ప్రపంచంలో రెండవ అత్యంత ఖరీదైన పండు. యుబారి కింగ్ మెలోన్ లాగా.. ఈ అరుదైన ద్రాక్ష జపాన్‌లో మాత్రమే లభిస్తుంది. 26 ప్రీమియం క్లాస్ రూబీ రోమన్ ద్రాక్షను కొనుగోలు చేయాలంటే సుమారు 8,400 డాలర్లు అంటే రూ. 6,99,699 చెల్లించాల్సి ఉంటుంది.
డెన్సుకే పుచ్చకాయ: ఇది ప్రపంచంలోనే మూడవ అత్యంత ఖరీదైన పండు. ఇది కూడా జపాన్ లోని హక్కైడోలో పండుతుంది. దీనిని నల్ల పుచ్చకాయ అని కూడా అంటారు. ఈ భారీ పండ్లు 11 కిలోల వరకు బరువు ఉంటాయి. ఎంతో తియ్యగా ఉండే ఈ పుచ్చకాయకు చారలు ఉండవు. 2008లో ఈ పుచ్చకాయ రూ.5 లక్షలకు పైగా అమ్ముడయింది.
మియాజాకి మామిడి: ప్రపంచంలో నాల్గవ అత్యంత ఖరీదైన పండు. ఇవి మామిడి పండ్లలో ప్రత్యేక రకాలు. వీటిని కూడా జపాన్ లోనే సాగు చేస్తారు. అవి ముదురు ఎరుపు రంగులో రుచిలో ఎంతో తియ్యగా ఉంటాయి. భారీ పరిమాణంలో ఉంటాయి. ఈ మామిడి పండు సగటు ధర రూ.3 లక్షలకు పైగా పలుకుతోంది.
హెలికాన్ పైనాపిల్: ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పైనాపిల్. ప్రపంచంలో 5వ అత్యంత ఖరీదైన పండు. ఇంగ్లండ్‌లోని ‘లాస్ట్ గార్డెన్ ఆఫ్ హెలిగాన్’లో లభించే ఈ రకం పైనాపిల్ ధర రూ.లక్ష కంటే ఎక్కువ.